శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం.. 14,15 శతాబ్లకు చెందినవిగా గుర్తింపు
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాంఫి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా, శివలింగం బయటపడింది. శివలింగంతోపాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. శివలింగం పక్కనే ఒక శిలాశాసనాన్నికూడా గుర్తించారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాంఫి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా, శివలింగం బయటపడింది. శివలింగంతోపాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది. శివలింగం పక్కనే ఒక శిలాశాసనాన్నికూడా గుర్తించారు. వెంటనే స్థానికులు శ్రీశైలం దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ అధికారులు, శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 శతాబ్దాలకు చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. శిలాశాసనాన్ని పరిశీలించిన ఆర్కియాలజీ నిపుణులు దానిపై రాసి ఉన్న లిపిని విశ్లేషించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. చక్రగుండం వద్ద సారంగధార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుడిని ప్రతిష్టించినట్లు శాసనంలో నమోదు చేసి ఉంది. ఈ మేరకు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం ద్వారా లిపిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. అలాగే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు.. బంగారు, వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. తాజాగా పురాతన శివలింగం బయటపడటం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అచ్చం సినిమాటిక్ స్టైల్లో.. దొంగల కోసం ఛేజింగ్
నడిరోడ్డుపై దారుణం.. ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత !! తొలగించినట్లు తెలిపిన ఓ మీడియా సంస్థ
అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఇదేం వేడుక ??
బైకు సర్వీసింగ్ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్ షాక్..