అచ్చం సినిమాటిక్‌ స్టైల్లో.. దొంగల కోసం ఛేజింగ్‌

అచ్చం సినిమాటిక్‌ స్టైల్లో.. దొంగల కోసం ఛేజింగ్‌

Phani CH

|

Updated on: Jul 08, 2024 | 9:36 PM

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నల్లగొండజిల్లా బోర్డర్‌...హైదరాబాద్‌ శివారులో కొన్ని రోజులుగా పార్థీ గ్యాంగ్ ఎంట్రీ పోలీసులకే సవాల్ విసురుతోంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరుస దోపిడీలు చేస్తూ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. టీవీ9లో వరుస కథనాలతో పోలీసులు అలర్టయ్యారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి...ORRలో దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నల్లగొండజిల్లా బోర్డర్‌…హైదరాబాద్‌ శివారులో కొన్ని రోజులుగా పార్థీ గ్యాంగ్ ఎంట్రీ పోలీసులకే సవాల్ విసురుతోంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరుస దోపిడీలు చేస్తూ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేస్తోంది. టీవీ9లో వరుస కథనాలతో పోలీసులు అలర్టయ్యారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి…ORRలో దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అచ్చం సినిమాటిక్‌ స్టైల్లో సాగిన చేజింగ్‌లో పోలీసులు ఎట్టకేలకు దొంగల ముఠాను పట్టుకున్నారు. హైవేపై జరుగుతున్న దోపిడీలపై టీవీ9 ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. టీవీ9 కథనాలకు స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. పార్థీ గ్యాంగ్‌ కోసం నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్లగొండ సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. దీంతో వారిపై దొంగలు కత్తులతో ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం దొంగలను అదపులోకి తీసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై దారుణం.. ఆటోవాలాను రక్తమోడేలా కొట్టిన యువతి

మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత !! తొలగించినట్లు తెలిపిన ఓ మీడియా సంస్థ

అనంత్‌ అంబానీ – రాధికా మర్చెంట్‌ ‘మామెరు’ ఫంక్షన్‌.. ఇదేం వేడుక ??

బైకు సర్వీసింగ్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్‌ షాక్‌..

ఇంటిని దోచేసి.. క్షమించమని లెటర్‌ రాసి వెళ్లిన దొంగ !!