Viral Video: గజరాజుకు కోపం వస్తే ఇంతే మరీ.. వీడియో చూస్తే గుండె ప్యాంట్‌లోకి రావాల్సిందే..

ఏనుగు సాధారణంగా చాలా ప్రశాంతమైన జంతువుగా పరిగణిస్తారు. కానీ ఏనుగుకు కోపం వస్తే ఎలా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. కొన్ని సార్లు ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంటాయి. పంట పొలాల్లో, ఇతర వాహనాలపై దాడులకు పాల్పడుతుంటాయి. ఏనుగులకు కోసం వస్తే వాటిని ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఏనుగు కారణం లేకుండా ఎవరినీ ఇబ్బంది పెట్టడం కనిపించదు. కానీ ఒక్కసారి కోపం వస్తే అరణ్యమంతా..

Viral Video: గజరాజుకు కోపం వస్తే ఇంతే మరీ.. వీడియో చూస్తే గుండె ప్యాంట్‌లోకి రావాల్సిందే..
Viral Videos
Follow us
Subhash Goud

|

Updated on: Jul 09, 2024 | 12:38 PM

ఏనుగు సాధారణంగా చాలా ప్రశాంతమైన జంతువుగా పరిగణిస్తారు. కానీ ఏనుగుకు కోపం వస్తే ఎలా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. కొన్ని సార్లు ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంటాయి. పంట పొలాల్లో, ఇతర వాహనాలపై దాడులకు పాల్పడుతుంటాయి. ఏనుగులకు కోసం వస్తే వాటిని ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఏనుగు కారణం లేకుండా ఎవరినీ ఇబ్బంది పెట్టడం కనిపించదు. కానీ ఒక్కసారి కోపం వస్తే అరణ్యమంతా ధ్వంసమవుతుంది. చాలా సార్లు ఏనుగులు అడవి నుంచి బయటకు వచ్చి నివాస ప్రాంతాలకు చేరుకుని బీభత్సం సృష్టిస్తుంచిన దృశ్యాలు ఎన్నో చూస్తుంటాము. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఇందులో ఏనుగు ఒక్కసారిగా కోపం తెచ్చుకుని రోడ్డును ధ్వంసం చేయడం ప్రారంభించింది. మావటి దానిని నియంత్రించిన తర్వాత కూడా అది వినేలా కనిపించడం లేదు. మావటి ఎంత నియంత్రించినా ఏ అది ఏమాత్రం లెక్క చేయకుండా బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న వాహనాలను ధ్వంసం చేసింది. ఆటోలను, బైక్‌లను చండాడేసింది. బంతిలా విసిరికొట్టేసింది. ఇది చూసిన జనాలు భయంతో వణికిపోయారు. ఏనుగును నిలువరించేందుకు ఎవరి తరం కాలేదు. ముందుకు వచ్చేందుకు జనాలు భయపడిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రోడ్డుపక్కన దొరికి వాటిని బద్దలు కొట్టేసింది. కొన్ని సెకన్లలోనే ఆటోను ధ్వంసం చేసింది. ఆటోను ఓ బొమ్మలా విసిరేసింది. ఈ వీడియో wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ అయ్యింది. అప్పటి నుంచి వైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..