తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం

తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం

Phani CH

|

Updated on: Jul 09, 2024 | 5:34 PM

దేశంలోని పలు ప్రధాన ఆలయాలతో పాటు, పర్యాటక ప్రదేశాలను కవర్‌ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే “భారత్ గౌరవ్” రైళ్లను నడుపుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ .. అయోధ్య బాల రామయ్యను దర్శించుకునే వారికి ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా కాశీ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు.

దేశంలోని పలు ప్రధాన ఆలయాలతో పాటు, పర్యాటక ప్రదేశాలను కవర్‌ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే “భారత్ గౌరవ్” రైళ్లను నడుపుతోంది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ .. అయోధ్య బాల రామయ్యను దర్శించుకునే వారికి ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా కాశీ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు. అయోధ్య-కాశీ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. ఈ రోజు నుంచి జులై 17వ తేదీ వరకు భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది. ఈ టూర్‌ మొత్తం 8 రాత్రులు/9 రోజులుగా సాగుతుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఈ టూర్‌లో భాగంగా అయోధ్య, కాశీ విశ్వనాథ్‌ ఆలయం, గయ వంటి ప్రాంతాలు కవర్‌ అవుతాయి. ప్రయాణికులు ఈ రైల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మంతో పాటు ఏపీలోని విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట , వైజాగ్, విజయనగరం & తిట్లాగఢ్‌ స్టేషన్స్‌లో రైలు ఎక్కవచ్చు. ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్‌లో జూలై 9వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది. ఇక తిరిగి 17వ తేదీన సికింద్రాబాద్‌ చేరుతుంది. టిక్కెట్ విషయానికొస్తే ఎకానమీ కేటగిరీ ఒక్కొక్కరికీ రూ.15,150గా నిర్ణయించారు. థర్డ్‌ ఏసీ విషయానికొస్తే రూ. 24,300, సెకెండ్‌ ఏసీకి రూ. 31,500గా నిర్ణయించారు. ఇందులో అధికారులు ప్రయాణీకులకు అన్ని రకాలుగా భద్రతను ఏర్పాట్లు చేశారు. వసతి, ఆహారం వంటి విషయాల్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి సౌకర్యం, ఉదయం టిఫిన్‌ మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌తో పాటు ప్రయాణ భీమా వంటివన్నీ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. ఆసక్తి ఉన్న వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా ?? జాగ్రత్త !!

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం.. 14,15 శతాబ్లకు చెందినవిగా గుర్తింపు