పోలీసులు తీర్చలేని పంచాయితీని.. చిటికెలో పరిష్కరించిన గేదె

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పోలీసుల సమక్షంలో తెగని పంచాయితీని ఓ గేదె చిటికెలో పరిష్కరించింది! దీంతో గేదె వల్ల తలెత్తిన వివాదం చివరకు గేదె ద్వారానే సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని రాయ్ అస్కరాన్ పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేదె మూడు రోజుల కిందట తప్పిపోయింది. మేత కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో దారి తెలియక తిరుగుతూ ఉంది.

పోలీసులు తీర్చలేని పంచాయితీని.. చిటికెలో పరిష్కరించిన గేదె

|

Updated on: Jul 09, 2024 | 5:41 PM

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పోలీసుల సమక్షంలో తెగని పంచాయితీని ఓ గేదె చిటికెలో పరిష్కరించింది! దీంతో గేదె వల్ల తలెత్తిన వివాదం చివరకు గేదె ద్వారానే సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని రాయ్ అస్కరాన్ పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేదె మూడు రోజుల కిందట తప్పిపోయింది. మేత కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో దారి తెలియక తిరుగుతూ ఉంది. దీన్ని గమనించిన హనుమాన్ సరోజ్ అనే గ్రామస్తుడు దాన్ని పట్టుకొని ఇంట్లో కట్టేసుకున్నాడు. మూడు రోజులుగా గేదె జాడ కోసం గాలించిన నంద్ లాల్.. ఎట్టకేలకు తన గేదె హనుమాన్ సరోజ్ వద్ద ఉందని గుర్తించాడు. గేదెను తిరిగి ఇవ్వాలని కోరగా అతను నిరాకరించాడు. అది తన గేదేనని బుకాయించాడు. దీంతో నంద్ లాల్ సమీపంలోని మహేష్ గంజ్ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించాడు. గేదెతోపాటు హనుమాన్ సరోజ్ ను స్టేషన్ కు పిలిపించగా అక్కడ కూడా ఆ గేదె తనదేనంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని గంటలపాటు ఈ తతంగం నడిచినా పంచాయితీ తెగలేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒరేయ్ ఎవర్రా నువ్వు.. పాము కాటేస్తే ఇలా చేస్తావా

మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ గదిలో మద్యం బాటిళ్లు

ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ!

ప్రపంచం అంతంపై.. బాబా వంగా సరికొత్త జోస్యం

తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం

 

Follow us