Huzurabad By Election: హుజూరాబాద్‌లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్న ఓటర్లు.. 33 శాతం దాటిన పోలింగ్..
Huzurabad By Election: హుజూరాబాద్ ఉపఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు.

Huzurabad By Election: హుజూరాబాద్ ఉపఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల సమయానికి నియోజకవర్గం వ్యాప్తంగా 33.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, హుజూరాబాద్‌లో 28.64 శాతం, వీణవంకలో 28.72, జమ్మికుంటలో 27.03 శాతం, ఇల్లందకుంటలో 24.83 శాతం, కమలాపూర్‌లో 27.71 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. హుజూరాబాద్‌లో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఇదిలాఉంటే.. హుజూరాబాద్ ఎన్నికల బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమ్మత్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రజలంతా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also read:
Stroke Risk: ఆ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు స్ట్రోక్ కి దగ్గరవుతున్నట్టే..
Viral Video: ఏం ఐడియా గురూ.! ఇతడి తెలివికి ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.!