Huzurabad By Election: హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో నిలిచేది వీరే..!
Huzurabad by poll: ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే హుజురాబాద్‌లో ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. తాజాగా నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా నేటితో పూర్తయింది.
Huzurabad By Election: హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే హుజురాబాద్‌లో ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. తాజాగా నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా నేటితో పూర్తయింది. దీంతో ఉప ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారో తేలిపోయింది.
హుజారాబాద్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ తరఫు నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ నర్సింహారావుతో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాళ 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 30 మంది మిగిలారు. ఇంకొంత మందిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీలు కోరినా, వాళ్లు పోటీలో ఉండటానికే మొగ్గు చూపారు. దీంతో 30 మంది మిగిలారు. హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉన్న 30 మందికి ఇవాళ గుర్తులు కేటాయించనున్నారు అధికారులు.
ఇదిలావుంటే, హజూరాబాద్ నియోజకవర్గం ఉప పోరులో మమొత్తం 61 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే, పలువురు ఇండిపెండెంట్స్ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్ దాఖలు చేయడంతో.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి నామినేషన్లను తిరస్కరించారు. 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోయింది. దీంతో ఎంత మంది బరిలో ఉన్నారనే సంగతి తేలిపోయింది. పోటీ నుంచి 12 మంది తప్పుకున్నారు. దీంతో బరిలో 30 మంది ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.
అలాగే…కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. రిటర్నింగ్ కార్యాలయంలో పలువురు ఇండిపెండెంట్లు వేచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బరిలో ఉండే వారి సంఖ్య ఇంకా తగ్గిపోవచ్చు. తర్వాతే..హుజూరాబాద్ ఆర్డీవో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఆధారంగా…ఈవీఎంలు ఉండనున్నాయి. ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు, నోటా కలిపి 16 మందికి అవకాశం ఉంది. ఇండిపెంట్ల అభ్యర్థుల పేర్లతో అక్షర క్రమంలో సింబల్స్ కేటాయించనున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ధీమాపై ప్రధాన ప్రతిపక్షాలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గెలుపు అస్త్రాన్ని సంధించేందుకు .. ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యనే ఉన్నా.. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇవ్వాలని యత్నిస్తోంది. గెలుపు కోసం పార్టీలు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.
Read Also… కోవిడ్ వాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్య సిబ్బంది వినతి.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్