కోవిడ్ వాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్య సిబ్బంది వినతి.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Oct 13, 2021 | 4:27 PM

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీకా పంపిణీకి రేపు, 14 వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది.

కోవిడ్ వాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్య సిబ్బంది వినతి.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్
Covid Vaccine

Follow us on

Break for Covid-19 Vaccination: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల సూచనల మేరకు టీకా వేగంగా కొనసాగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. టీకా పంపిణీలో నెంబర్‌వన్‌గా నిలిచింది భారత్‌. వ్యాక్సినేషన్‌లో అమెరికాను కూడా బీట్‌ చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీకా పంపిణీకి రేపు, 14 వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన కరోనా వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్. రేపు కోవిద్ వాక్సినేషన్ కు విరామం ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. డిసెంబర్‌ నాటికి టీకా పంపిణీలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ . ప్రపంచంలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారు, వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న వాళ్ల సంఖ్య భారత్‌లోనే అత్యధికమని వెల్లడించింది. దేశంలో సెప్టెంబరు వరకు పురుషులకు 52.5%, మహిళలకు 47.5%, ఇతరులకు 0.02% డోసుల పంపిణీ జరిగింది. మొత్తం డోసుల్లో 62.54% గ్రామీణ ప్రాంతాల్లో వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 18 ఏళ్లు పైబడ్డ వాళ్లలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్న వాళ్ల సంఖ్య 67 శాతం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలకు రెండు లక్షల 44,310 టీకా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 18.1 కోట్ల మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.

Read Also…  T20 World Cup: టీమిండియా స్వ్కాడ్‌లో చేరనున్న యంగ్ ప్లేయర్? హార్ధిక్ ఫిట్‌నెస్‌పై ఇంకా డౌటే.. మరో రెండు రోజుల్లో ఏం జరగనుంది..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu