హుజూరాబాద్ ఉపపోరులో ఎత్తుకు పైఎత్తులు.. రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్.. స్క్రూట్నీలో ఏంజరిగిందంటే..?

మొత్తం 61 మంది నామినేషన్స్‌ దాఖలు చేశారు. ఇవాళ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు ఎన్నికల అధికారులు. అయితే, పలువురు ఇండిపెండెంట్స్‌ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్‌ దాఖలు చేసినట్టు గుర్తించారు.

హుజూరాబాద్ ఉపపోరులో ఎత్తుకు పైఎత్తులు.. రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్.. స్క్రూట్నీలో ఏంజరిగిందంటే..?
Huzurabad By Poll
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 11, 2021 | 8:55 PM

Huzurabad By Election: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. పీఠం నీదా..నాదా..? సై అంటే సై అంటున్నారు అభ్యర్థులు. జోరుగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు. పదునైన మాటలతో ప్రత్యర్థుల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. మొత్తం 61 మంది నామినేషన్స్‌ దాఖలు చేశారు. ఇవాళ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు ఎన్నికల అధికారులు. అయితే, పలువురు ఇండిపెండెంట్స్‌ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్‌ దాఖలు చేసినట్టు గుర్తించారు. చివరికి క్వాలిఫై అయినవారి జాబితాను ప్రకటించారు రిటర్నింగ్ అధికారి.

రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన హుజూరాబాద్ బరిలో చివరికి మొత్తం 42 మంది నిలిచారు. మొత్తం 61 మంది ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. వీటిలో 19 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ తిరస్కరణకు గురైన వారిలో ఏఐఎంఐఎం అభ్యర్థి తామిర్ కమల్ ఖుంద్మీరి కూడా ఉన్నారు. నామినేషన్ స్వీకరించిన వారిలో 31 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట నర్సింగ రావు బాల్మూర్ పోటీ పడుతున్నారు.

ఇదిలావుంటే, ఉప ఎన్నిక నామినేషన్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఊరట లభించింది. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలనలో సరైన పత్రాలు లేకపోవడంతో ఈటల రాజేందర్ మినహా మిగిలిని ముగ్గురు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఇప్పలపల్లి రాజేందర్‌, ఇసంపల్లి రాజేందర్‌, ఇబ్బడి రాజేందర్‌ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లయ్యింది. 61మంది మంది అభ్యర్థులు 92 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. పరిశీలనలో నిబంధనల ప్రకారం లేని 19 మంది అభ్యర్థుల 23 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం బరిలో ఉన్న 42 మంది అభ్యర్థులు ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. కాగా, తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 13 వరకు గడువు ఉంది.

Read Also… Global Warming: హిమాలయాల్లో పొంచి ఉన్న పెనుముప్పు.. కరుగుతున్న హిమనీ నదాలతో పొంగుతున్న సరస్సులు! 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!