AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Toy: రైతు వినూత్న ఆలోచన.. హర్రర్ బొమ్మ తయారీ.. దాన్ని చూస్తే జంతువులు, పక్షులే కాదు మనుషులకు కూడా..

రైతులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. పంట సాగును సులభతరం చేస్తున్నారు. జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకుంటున్నారు...

Horror Toy: రైతు వినూత్న ఆలోచన.. హర్రర్ బొమ్మ తయారీ.. దాన్ని చూస్తే జంతువులు, పక్షులే కాదు మనుషులకు కూడా..
Toy
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 11, 2021 | 8:39 PM

 రైతులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. పంట సాగును సులభతరం చేస్తున్నారు. జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకుంటున్నారు. చెట్టుకు సీసా కట్టి దాని పక్కకు ఇనుప కడ్డి కట్టి చంప్పుడు వచ్చేలా చేశారు.  కొద్ది రోజుల క్రితం పంటను రక్షించడానికి హీరోయిన్ బొమ్మలను పెట్టారు. తాజాగా ఓ రైతు కొత్త ఆలోచన చేశాడు.  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవి జంతువులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు. దీనికి గాను ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు , ఒక స్ప్రింగ్‎తో జోడించిన సైకిల్ హాండీల్ డబ్బాకు ఓ పాత అంగిని తొడిగించి బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశారు.
గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను అటు ఇటూ ఊగుతుంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అటవీ జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా ఉంటాయి. దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అయిందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తయారు చేసి ఇస్తానని చెపుతున్నాడు యువరైతు సాయికిరణ్.
ఈ బొమ్మ గాలి దిశకు అనువుగా అటూ ఇటూ తిరిగేటపుడు అడవి జంతువుల్ని బెదరగొట్టేలా ఈ బొమ్మ ‘కిర్‌కిర్‌’ శబ్దాలు చేస్తుంది. తనకున్న అయిదెకరాల్లో వేసిన టమాటా, క్యాబేజీ పంటలను రక్షించుకునేందుకు బొమ్మను తయారుచేశానని సాయికిరణ్‌ చెప్పాడు. రెండు నెలలుగా వన్యప్రాణులు పొలంలోకి రావటంలేదంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఈ బొమ్మను చూస్తు పక్షలు, జంతువులే కాదు మనుషులు కూడా భయపడతారు. రాత్రి అటూ వెళ్లే వారు నిజంగా దాన్ని దెయ్యం అనుకుంటారు.

సమంత అద్భుతంగా నటించిన 5 బెస్ట్ మూవీస్ ఇవే!
సమంత అద్భుతంగా నటించిన 5 బెస్ట్ మూవీస్ ఇవే!
ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్‌
ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్‌
వేసవిలో నోరూరించే మ్యాంగో లస్సీ ఎలా తయారు చేయాలో తెలుసా?
వేసవిలో నోరూరించే మ్యాంగో లస్సీ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇతనో వెరైటీ ఎలక్ట్రీషియన్‌.. ఇతని ఐడియాకి అంతా అవాక్కే
ఇతనో వెరైటీ ఎలక్ట్రీషియన్‌.. ఇతని ఐడియాకి అంతా అవాక్కే
చర్మం కాంతివంతంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు
చర్మం కాంతివంతంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు
సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్‌ తినాలి ??
సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్‌ తినాలి ??
విపరీతమైన నొప్పి, బరువు తగ్గిపోతోంది.. CT స్కాన్‌ చేయగా
విపరీతమైన నొప్పి, బరువు తగ్గిపోతోంది.. CT స్కాన్‌ చేయగా
సినీ ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం వచ్చి..
స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం వచ్చి..
4 వారాల్లో బరువు తగ్గించే కొరియన్ డైట్.. వీళ్లేం తింటారంటే..
4 వారాల్లో బరువు తగ్గించే కొరియన్ డైట్.. వీళ్లేం తింటారంటే..