Etela Rajender: నాకు గన్‌మెన్లని తగ్గించారు.. ఆ తేదీ వస్తుందంటే అనుమానం వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటెల సంచనలన కామెంట్స్
Etela Rajender: హుజురాబాద్ ఉపఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు.. ప్రతిపక్ష పార్టీ బీజేపీనేతలకు మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. మాజీ మంత్రి..
Etela Rajender: హుజురాబాద్ ఉపఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు.. ప్రతిపక్ష పార్టీ బీజేపీనేతలకు మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ నేతల తీరుపై హరీష్ రావు పై మండిపడ్డారు. హరీశ్ రావు పచ్చి అబద్ధాల కోరు అయ్యారు.. ఒకప్పుడు ఆయనపై గౌరవం ఉండేది.. మామకు బానిసై నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు తాను ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదని ఈటల స్పష్టం చేశారు. మీడియా యజమానులారా? ప్రజాస్వామ్యాన్ని కోరే మేధావుల్లారా.. హుజురాబాద్ లో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండని సూచించారు. ఇదే పరంపర రాబోయే కాలంలో కూడా కొనసాగితే.. తెలంగాణ బానిసత్వంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ సారి కూడ వడ్లు కొంటామని రైతులకు ఈటెల హామీనిచ్చారు.
ఇక ఈటల రాజేందర్ మాట్లాడుతున్న సమయంలో మరోసారి విద్యుత్ పోవడంతో.. ఇదే విషయంపై ఈటెల స్పందిస్తూ.. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడ కరెంట్ తీసేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ మీటింగులకు బయట నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఈటెల. ఇక సీఎం కేసీఆర్ కు హుజురాబాద్ ఉపఎన్నికలో ఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం లేక తొండాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నా కొడుకంత వయస్సున్న ఒక వ్యక్తి నన్ను తమ్మి అని మాట్లాడుతున్నాడు. ఒకరికి రూ. 50 లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టించి నాకు వ్యతిరేకంగా దళితవాడల్లో పంచిస్తున్నారని ఆరోపణలు చేశారు.
అంతేకాదు 13వ తేదీ దగ్గరకొస్తోందని.. దీంతో తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు ఈటెల. తనకు గన్ మెన్లు తగ్గించారని.. మాజీ మంత్రికి ఒకే గన్ మెన్ ను ఇచ్చారంటే.. ఏదైనా కుట్ర కేసీఆర్ చేస్తున్నట్లు అనుమానం వస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటెల. ఆనాడు వై.ఎస్. మంత్రి పదవి ఆఫర్ చేసినా తాను లొంగలేదని గుర్తు చేసుకున్నారు ఈటెల రాజేందర్.
Also Read: