Akbaruddin Owaisi: నేను ఎన్నిరోజులు బతుకుతానో తెలీదు.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు
Akbaruddin Owaisi: ఏళ్ల తరబడి తమ కమ్యునిటీ అభివృద్ధి కోసం తాను పోరాటం చేస్తూనే ఉన్నట్లు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
Akbaruddin Owaisi: ఏళ్ల తరబడి తమ కమ్యునిటీ అభివృద్ధి కోసం తాను పోరాటం చేస్తూనే ఉన్నానని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి.. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై అక్బరుద్దీన్ మాట్లాడారు. తమ కమ్యునిటీ కోసం అసెంబ్లీ వేదికగా తాను అరుస్తూనే ఉన్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానన్నారు. అయినా మైనార్టీలకు న్యాయం జరగకపోవడం పట్ల తన కడుపు మండుతోందన్నారు. తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు..కానీ ఉన్నన్ని రోజులు తమ కమ్యునిటీ శ్రేయస్సు కోసం కృషి చేస్తూనే ఉంటానన్నారు. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆరోపించిన ఆయన.. 400 జీవోలు జారీ చేసినా వారి అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
పాతబస్తీ వివక్షకు గురవుతోందని అక్బరుద్దీన్ ఆరోపించారు. హైదరాబాద్‌కి మెట్రోరైలు వచ్చిందికానీ.. పాతబస్తీకి రాలేదన్నారు.పాతబస్తీకి మెట్రో కావాలంటే ఢిల్లీ అనుమతి కావాలని.. అందరం కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి అడుగుదామన్నారు. పాతబస్తీకి బస్సులు కూడా పూర్తిగా నడవడం రావడం లేదన్నారు. హైదరాబాద్ అంతా మెట్రో నడుస్తుంది కానీ పాతబస్తీ అనగానే పర్యావరణ అనుమతి అడ్డు వస్తుందా అని ప్రశ్నించారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు దానం కౌంటర్..
తెలంగాణ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ చేసిన విమర్శలు సరికాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. 2014 – 15లో మైనార్టీ సంక్షేమానికి రూ.6000 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. షాది ముబారక్ కోసం రూ.1500 కోట్లు అందించిందన్నారు. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో మేము ఏకీభవించడం లేదన్నారు.
Also Read..
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో గ్రూప్-1,2 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
Movie Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు