Shadnagar: ‘ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి’.. భార్య వదిలేసిందని తల్లి సమాధి వద్దే భర్త సూసైడ్
షాద్‌నగర్‌లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. భార్య కన్పించకుండా పోయిందని భర్త సూసైడ్ చేసుకున్నాడు. తల్లి సమాధి వద్దే తనువు చాలించాడు..
భార్య చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ వేదన భరించలేక ఓ భర్త తన తల్లి సమాధి వద్ద తనువు చాలించాడు. ఈ కన్నీరు పెట్టించే ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెలుగుచూసింది. సూసైడ్‌కు ముందు అతడు తన మనోవేదనను సెల్ఫీ వడియో రూపంలో పంచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొండన్నగూడంకు చెందిన రాజు భార్య.. 3 రోజుల క్రితం ఎక్కడికోవ వెళ్లిపోయింది. రాజు తనకు తెలిసిన అన్ని ప్రాంతాల్లో వెతికాడు. బంధువులను, స్నేహితులకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాడు. కానీ ఏ సమాచారం తెలియలేదు. దీంతో బాధతో కుంగిపోయాడు. తీవ్ర మనోవేదనకు లోనైన రాజు.. సెల్పీ వీడియో తీసుకుని తన తల్లి సమాధి వద్ద సూసైడ్ చేసుకున్నాడు.
సెల్ఫీ వీడియోలో నీవు లేక నేను లేను అంటూ భార్యపై ప్రేమను వ్యక్తపరిచాడు. తనపై ఇష్టం లేకనే భార్య వెళ్లిపోయి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆమె ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని.. ఆకాక్షించాడు. తాను చనిపోయిన తర్వాత కూడా భార్యపై కేసు పెట్టవద్దని పోలీసులను కోరాడు. ఆపై ఏడుస్తూ.. తన మాతృమూర్తి సమాధి వద్ద పురుగుల మందు కలిపిన అన్నం తిని చనిపోయాడు. అతడి వీడియో చూసిన జనాలు అయ్యో పాపం అంటూ.. బాధపడుతున్నారు. ఇంత ప్రేమించే భర్తను వదిలేసి వెళ్లిన భార్యను తిట్టి పోస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కనపడకుండాపోయిన రాజు భార్యను వెతికి.. వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం