Hyderabad: కేటీఆర్ సార్ కొంచెం నాలాల సంగతి చూడండి
హైదరాబాద్‌లో డేంజర్ నాలాలు దర్శనమిస్తున్నాయి. 3 రోజుల క్రితం భారీగా వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమ్యాయి. అయితే ఉదయ్ తేజ అనే ఛార్డెట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
హైదరాబాద్‌లో డేంజర్ నాలాలు దర్శనమిస్తున్నాయి. 3 రోజుల క్రితం భారీగా వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమ్యాయి. అయితే ఉదయ్ తేజ అనే ఛార్డెట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇంజనీర్లు చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన కారు రిపేయిరింగ్ కోసం దాదాపు రూ.40 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ టవర్స్ పక్కన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నిర్మించిన ఇంజనీర్లు డ్రైనేజీ హోల్స్ పెట్టడం మర్చిపోయారని విమర్శించారు. దీంతో వర్షపు నీరు నాల లోపలికి వెళ్లకుండా రోడ్డుపైనే నీళ్లు నిలిచిపోయాంటూ మారిందంటూ వాపోయారు.
Stuck with pregnant wife in the middle of the night waiting for towing services and an alternative vehicle was the most harrowing experience. @mcnarsingi @GHMCOnline @prakashgoudssm @HYDTP @HydTimes @etvteluguindia @V6News @Abnandhrajyothi @bmwindia @TataAIGMotor pic.twitter.com/jl7d3EX473
ఇవి కూడా చదవండి— Uday Teja M (@m_udayteja) June 30, 2023
రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో 12 బీఎండబ్ల్యూ కార్లు, 8 బెంజ్ కార్లు నిలిచిపోయాయన్నారు. అర్ధరాత్రి తన బీఎండబ్ల్యూ కారులో గర్భిణీగా ఉన్న భార్యతో పాటు చిక్కుకుపోయానని తెలిపారు. నాలాలను నిర్మించడం గొప్ప విషయమే కానీ నాలాలోకి నీరు వెళ్లకుండా ఒక ఫీట్ ఎత్తులో గోడ నిర్మించడం విడ్డూరమన్నారు. వీటి సమస్యలకు ఏదైనా పరిష్కారం ఉందా అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
One small error by the Engineering team costed me 40 lakhs and two more passers by a lot more. The great engineering team who built the ORR Service road near movie towers forgot to put drain holes in the small parapet wall. This didn’t let the rain water go down the Nala
— Uday Teja M (@m_udayteja) June 30, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం