AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: హస్తిన బయల్దేరిన బండి సంజయ్.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్‌ రావు.. ఏం జరుగుతోంది..

Bandi Sanjay: తెలంగాణ కమలంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ఏదో విషయంలో రోజు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతున్న సమయంలోనే అత్యవసరంగా ఢిల్లీకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లడం

Telangana BJP: హస్తిన బయల్దేరిన బండి సంజయ్.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్‌ రావు.. ఏం జరుగుతోంది..
Bandi Sanjay
Sanjay Kasula
|

Updated on: Jul 03, 2023 | 12:48 PM

Share

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో అధికార పార్టీకి తామే ధీటైన పోటీ అని చెప్పుకుంటున్న తెలంగాణ కమలంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ఏదో విషయంలో రోజు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతున్న సమయంలోనే అత్యవసరంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఢిల్లీకి వెళ్లడం సంచలనంగా మారింది. అంతకంటే ముందే ఢిల్లీకి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెళ్లడం సంచలనంగా మారింది. ఇద్దరు తెలంగాణ రాష్ట్ర నేతలు ఢిల్లీకి ఒకరి తర్వాత ఒకరు వెల్లడానికి కారణం తెలియకపోయినా.. హస్తినాలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి.

గత వారం ఢిల్లీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇంఛార్జ్‌లతో జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌ సమావేశం అయ్యారు. అక్కడ ఏం జరిగిందన్నదనే అంశంపై ఊహాగానాలు చక్కర్లు కొట్టినా అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అన్నది మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు.

ఇదిలావుంటే, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న వార్తలు మాత్రం మీడియాలో గుప్పుమంటున్నాయి. కొంతకాలంగా ఆ నాయకులు అస్సలు కలుసుకోవడం లేదనే ప్రచారం కూడా భాగా సాగింది. పార్టీ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉండటంతో నేరుగా అధిష్ఠానమే రంగంలోకి దిగి సమస్యకు ముగింపు పలికింది. ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఈ నేతల గత వారం వరంగల్ ప్రధాని మోదీ సభలో కలిసికట్టుగా కనిపించారు.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఢిల్లీకి వెళ్లడం.. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బయలుదేరడంతో మరోసారి చర్చ మొదలైంది.  రఘునందర్ రావు తనకు శాసనసభాపక్ష నేత పదవి కావాలంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కేంద్ర మంత్రులను రఘునందన్‌రావు కలవడం కూడా చర్చకు ప్రధాన కారణంగా ామరింది. కేబినెట్ మార్పులపై తెలంగాణ BJP సమీకరణాలు ఆధారపడ్డాయనే ప్రచారం కూడా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం