AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆయనకు భార్యంటే ఎంత ప్రేమో.. ఏకంగా విగ్రహం పెట్టి, రోజూ పూజలు చేసేస్తున్నాడు!

ఆయనకు భార్య అంటే ప్రాణం.. భార్యను దేవతగా భావించి, ఆమెను నిత్యం స్మరించుకుంటూ ఉంటాడు. అంతే కాదు భార్య విగ్రహాన్ని నిర్మించి, ఏకంగా గుడే కట్టేశాడు. భార్య విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. భార్య బతికి ఉండగానే.. ఆమె విగ్రహంతో పాటు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఆమె మరణానంతంర తమ దాంపత్యానికి ప్రతీకగా ఇద్దరి విగ్రహాలను రూపొందించి, దేవాలయంగా..

Telangana: ఆయనకు భార్యంటే ఎంత ప్రేమో.. ఏకంగా విగ్రహం పెట్టి, రోజూ పూజలు చేసేస్తున్నాడు!
Husband Made An Idol Of Wife And Worships Regularly
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 22, 2024 | 11:59 AM

Share

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 22: ఆయనకు భార్య అంటే ప్రాణం.. భార్యను దేవతగా భావించి, ఆమెను నిత్యం స్మరించుకుంటూ ఉంటాడు. అంతే కాదు భార్య విగ్రహాన్ని నిర్మించి, ఏకంగా గుడే కట్టేశాడు. భార్య విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. భార్య బతికి ఉండగానే.. ఆమె విగ్రహంతో పాటు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఆమె మరణానంతంర తమ దాంపత్యానికి ప్రతీకగా ఇద్దరి విగ్రహాలను రూపొందించి, దేవాలయంగా తీర్చిదిద్ది పూజలు చేస్తున్నాడు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన జొంగోని ముత్తయ్య 30 సంవత్సరాల క్రితం భార్యాభర్తలు ఇద్దరు బతికుండగానే విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అతని భార్య లక్ష్మి 14 సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పటినుండి భార్య లక్ష్మి విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్నాడు. ముత్తయ్య చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు వీరయ్య రాజవ్వ చనిపోవడంతో ఖననం చేయాలంటే గుంట జాగ కూడా లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. ఆ కష్టం తన పిల్లలకు రావద్దన్న ఉద్దేశంతో ముత్తయ్య తన పొలం వద్ద బతికుండగానే భార్యాభర్తల ఇద్దరి విగ్రహాలను నిర్మించుకున్నాడు.

వాటి ముందు సమాధి కోసం స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విగ్రహాల దగ్గర.. శివ లింగం కూడా ఉంది. భార్య విగ్రహానికి దేవుడి కంటే అధికంగా పూజలు చేస్తున్నాడు ముత్తయ్య. ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు ఇక్కడే గడుపుతాడు. ఉదయం విగ్రహాన్ని శుభ్రం చేసి, ఆ తరువాత పువ్వులతో అలంకరణ చేస్తాడు. మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తాడు. భార్య వర్ధంతి సందర్బంగా కుటుంబ సభ్యులు ఇక్కడ హాజరువ్వుతారు. రోజంతా కూడా ఇక్కడే గడుపుతారు. ముత్తయ్యకు భార్య ఫై ఉన్న ప్రేమ చూసి చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. ఈ విగ్రహాలను చూడటానికి చుట్టూ పక్కలవారు కూడా వస్తుంటారు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను నానా హింసలు పెట్టి బతికుండగానే నరకం చూపించే నేటి కాలం భర్తలకు.. ముత్తయ్య ఆదర్శంగా నిలవాలి. భార్యపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి వ్యక్తులు సాజానికి ఆదర్శప్రాయులంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.