AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలి.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్

పండగ వచ్చినా.. పెళ్లి జరిగినా.. ఇంకా ఏ శుభకార్యమైనా.. ఉరేగింపులైనా.. డీజే ఉండాల్సిందే.. ఇది ఒక ఆనవాయితీగా మారింది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా డాన్సులు చేస్తూ ఊరంతా తెలిసేలా హోరెత్తించడం ఇప్పుడు ట్రెండ్.. డీజే కొట్టు.. దుమ్ము రేపు అన్నట్లుగా ముఖ్యంగా యువత దీనికి బాగా ఆకర్షితులయ్యారు..

Asaduddin Owaisi: డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలి.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్
Asaduddin Owaisi
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 22, 2024 | 12:41 PM

Share

పండగ వచ్చినా.. పెళ్లి జరిగినా.. ఇంకా ఏ శుభకార్యమైనా ఇప్పుడు అందరికీ డీజే ర్యాలీలు తీయడం ఒక ఆనవాయితీగా మారింది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా డాన్సులు చేస్తూ ఊరంతా తెలిసేలా హోరెత్తించడం ఇప్పుడు ఒక సంప్రదాయంగా మారింది. డీజే కొట్టు.. దుమ్ము రేపు అన్నట్లుగా ముఖ్యంగా యువత దీనికి బాగా ఆకర్షితులవుతున్నారు. కొందరు.. ఈ డీజే సౌండ్‌లతో చెవులకు చిల్లులు పడేలా నానా హంగామా చేస్తున్నారు. కానీ అది ఆ చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజే డాన్సులతో యువత చెడిపోతున్నారని, తద్వారా ప్రజల్లో దీని వల్ల ఎలాంటి మంచి సందేశం వెళ్లడం లేదని అన్నారు. అందుకే మతపరమైన ర్యాలీల్లో డీజేలపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. డీజే సంస్కృతితో ఆధ్యాత్మిక వాతావరణం కలుషితం అవుతోందని అనడంతో పాటు మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలడంపై స్పందించారు. ఇది ఏ మాత్రం సమాజానికి పనికి వచ్చే చర్య కాదన్నారు. డీజే కావాలి అని కోరుకునే వాళ్లకు క్లబ్బులు, పబ్బులు లాంటివి సిద్ధంగా ఉంటాయని, అంతేకాని ఇలా నడిరోడ్డు మీద డీజే అంటూ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మిలాద్ ఉన్ నబీ వేడుకల సమయంలో చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలిపోయి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానిక అధికారులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. డీజే పేరుతో కొంతమంది చేసే వికృత చేష్టలు, విన్యాసాలతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.

మరోవైపు, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఉరడీ మధు అనే యువకుడు డీజే శబ్దానికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ క్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణలో డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలని తెలిపారు. డీజే పేరుతో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తోందని.. మతపరమైన కార్యక్రమాలే కాదు.. తెలంగాణలో డీజేకు అనుమతులు ఇవ్వొద్దని.. శాశ్వతంగా నిషేధం విధించాలని అసదుద్దీన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..