Chicken: భార్య చికెన్ వండలేదని డయల్ 100కు ఫోన్.. పోలీసులు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Husband dail 100 against wife: చికెన్ వండలేదని భర్తకు కోపం వచ్చింది. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే..
Husband dail 100 against wife: చికెన్ వండలేదని భర్తకు కోపం వచ్చింది. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు తన సమస్యను పరిష్కరిస్తారనుకున్న ఆ వ్యక్తికి వారు షాకిచ్చారు. సమయాన్ని వృధా చేసినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కనగల్ మండలం చర్ల గౌరారానికి చెందిన ఓర్సు నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో 100కు ఆరు సార్లు ఫోన్ చేశాడు. ఎంటోనంటూ ఆరా తీయగా.. అతను చెప్పే మాటలు విని కోపం వచ్చింది. హోలీ పండగ రోజు తన భార్య చికెన్ (Chicken) తీసుకొచ్చి వంటచేసి పెట్టలేదని.. ఆమెపై చర్య తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాడు. అయితే.. ముందు ఫోన్ కట్ చేసినప్పటికీ.. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేశాడు. దీంతో పోలీసులు నవీన్ పై సీరియస్ అయ్యారు.
డయల్ 100కు ఫోన్ చేసి సమయాన్ని వృథా చేసినందుకు నవీన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నగేశ్ వెల్లడించారు. చర్లగౌరారానికి చెందిన నవీన్ మద్యం మత్తులో భార్య మాంసం వండిపెట్టలేదంటూ 100 కు ఆరు సార్లు ఫోన్ చేశాడని పేర్కొన్నారు. పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆపద, అత్యవసర సమయంలో మాత్రమే 100 కు ఫోన్ చేయాలంటూ ఆయన సూచించారు.
Also Read: