Thief Caught: దొంగలను ఇలా కూడా పట్టుకుంటారా..! ఆ పోలీసుల క్రేజీ ప్లాన్.. తెలుసుకుంటే షాకవుతారు..
Whats App: సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో సాంకేతికత(Technology) వినియోగానికి అందరూ దగ్గర కావటంతో వారి పని మరింత సులువుగా మారుతోంది.
Thief Caught: సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో సాంకేతికత(Technology) వినియోగానికి అందరూ దగ్గర కావటంతో వారి పని మరింత సులువుగా మారుతోంది. తాజాగా ఓ దొంగను పట్టుకునేందుకు కేరళ పోలీసులు(Kerala Police) చేసిన ప్రయత్నం చూస్తే ఇదెక్కడి ప్లాన్ రా బాబు అని అనుకోకమానరు. ఓ మహిళను కొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిను పట్టుకునేందుకు.. కాసరగొడ్ జిల్లా పోలీసులు ఇందుకోసం సామాజిక మాధ్యమాలను వినియోగించారు. అందులోనూ దొంగ పేరుమీదే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. స్థానికులను సభ్యులుగా చేర్చి దొంగ సమాచారం అందిచాలని కోరారు.
అసలు జరిగిందేంటంటే..
పది రోజుల క్రితం మడిక్కాయ్ గ్రామానికి చెందిన ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు దుండగుడు అశోకన్. కేసు నమోదు చేసుకున్న హోస్దుర్గ్ పోలీసులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని వారు ఫిక్స్ అయ్యారు. దొంగ పేరు, ఫొటోతో గ్రూప్‌ను క్రియేట్ చేసి స్థానికులను అందులో చేర్చారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 251 మంది సభ్యులు ఉన్నారు. పోలీసులతో పాటు గ్రామస్థులు అశోకన్ కోసం గాలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూప్‌లో షేర్చేసుకున్నారు.
దొంగతనానికి పాల్పడిన అశోకన్ సన్నిహితుడు మంజునాథన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అశోకన్ తప్పించుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి దాక్కున్నాడు. సుమారు 400 ఎకరాల విస్తరించిన అటవిలో అతడిని వెతకటం పోలీసులకు అసాధ్యంగా మారింది. దొంగను పట్టుకునేందుకు పోలీసులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటం ఇదే తొలిసారి.
ఇవీ చదవండి..
Anand Mahindra: మంచి పనులు చేయటంలో మీరు తగ్గొద్దు.. సహాయం చేయటంలో మేం తగ్గేదే లే..
Edible Oil: సామాన్యులకు శుభవార్త..! వంట నూనెల ధరలు తగ్గుతాయా..