Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: మంచి పనులు చేయటంలో మీరు తగ్గొద్దు.. సహాయం చేయటంలో మేం తగ్గేదే లే..

Anand Mahindra: వ్యాపారానికి ఎక్కడ అవకాశం ఉందని తెలిసినా దానిపై స్పందిస్తారు మహీంద్రా గ్రూప్(Mahindra Group) ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. తాజాగా బీఎంసీ కమిషనర్ అడిగిన సాయానికి ట్విట్టర్ లో ఎలా స్పందించారంటే..

Anand Mahindra: మంచి పనులు చేయటంలో మీరు తగ్గొద్దు.. సహాయం చేయటంలో మేం తగ్గేదే లే..
Anand Mahindra
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 20, 2022 | 6:41 AM

Anand Mahindra: వ్యాపారానికి ఎక్కడ అవకాశం ఉందని తెలిసినా దానిపై స్పందిస్తారు మహీంద్రా గ్రూప్(Mahindra Group) ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. మొన్న సినీ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సాయం కోరగా.. తాజాగా ముంబై కమిషనర్‌ సంజయ్‌పాండే(Sanjay Pandey) మహీంద్రాను సహాయం అడిగాడు. కారణం మంచిదైతే సాయం చేయడంలో తగ్గేదేలేదని ఆనంద్‌ మహీంద్రా అంటున్నారు. ముంబయి నగర రోడ్లపై చాలా చోట్ల పాడైన వాహనాలు, ఉపయోగించని వాహనాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ వాహనాలు రోడ్లపై ఉంటున్నా.. వాటిపై ఎవరూ దృష్టి సారించటం లేదు. తాజాగా బృహన్‌ ముంబయి కమిషనర్‌ రిమూవ్‌ కటారా పేరుతో పాత వాహానాల తొలగింపు పనులు చేపడుతున్నారు. మొదటి రోజే ఇలాంటివి 358 వాహనాలను తొలగించారు. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. దీంతో మూవ్‌కటారా మూవ్‌మెంట్‌కి హెల్ప్‌ చేయాలంటూ మహీంద్రారైజ్‌, టాటా కంపెనీలను బీఎంసీ కమిషనర్‌ సంజయ్‌పాండే ట్విట్టర్ వేదికగా 2022 మార్చి 18న కోరారు.

బీఎంసీ కమిషనర్‌ సంజయ్‌ పాండే రిక్వెస్ట్‌పై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సానుకూలంగా స్పందించారు. ముంబయికి మంచి పనులు చేయడంలో మీరు ఏమాత్రం ఆలస్యం చేయెుద్దు. అదే విధంగా మీరు అడిగిన సాయం అందించటంలో మా వైపు నుంచి ఎటువంటి ఆలస్యం జరగదని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో బదులిచ్చారు. మహీంద్రా ట్రక్‌బస్‌ టీమ్‌ మీతో టచ్‌లోకి వస్తారంటూ మరుసటి రోజే పాజిటివ్ గా స్పందించారు.

ఇవీ చదవండి..

Gold Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

Suzuki Motor: భారత్‌లో సుజుకీ మోటార్‌ భారీ పెట్టుబ‌డులు.. ఎలక్ర్టిక్‌ వెహికిల్స్‌ రంగంలో..