AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections: మీకు ఓటర్‌ స్లిప్‌ రాలేదా.? మీ పోలింగ్ బూత్‌ ఎక్కడో ఇలా తెలుసుకోండి.?

అయితే ఇంటి అడ్రస్‌ మారడమో, మరే టెక్నికల్‌ సమస్యల కారణంగానైనా ఓటర్‌ స్లిప్‌ రాని వారు కూడా ఉన్నారు. అయితే ఓటర్‌ స్లిప్‌ రాలేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మీకు ఓటర్‌ స్లిప్‌ రాకపోయినా, మీ పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ పోలింగ్ బూత్‌ను ఎలా తెలుసుకోవాలంటే..

Elections: మీకు ఓటర్‌ స్లిప్‌ రాలేదా.? మీ పోలింగ్ బూత్‌ ఎక్కడో ఇలా తెలుసుకోండి.?
How To Know Polling Station
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 30, 2023 | 9:43 AM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. తమ ఓటు హక్కుతో నేతల తల రాతను మార్చడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాదాపు అందరికీ ఓటర్ల స్లిప్పులు ఇంటికి వచ్చాయి. అందులో పేర్కొన్న వివరాల ఆధారంగా తమ పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకొని ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఇంటి అడ్రస్‌ మారడమో, మరే టెక్నికల్‌ సమస్యల కారణంగానైనా ఓటర్‌ స్లిప్‌ రాని వారు కూడా ఉన్నారు. అయితే ఓటర్‌ స్లిప్‌ రాలేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మీకు ఓటర్‌ స్లిప్‌ రాకపోయినా, మీ పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ పోలింగ్ బూత్‌ను ఎలా తెలుసుకోవాలంటే..

* మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్‌ను 1950, 92117 28082 నంబర్లకు SMS రూపంలో పంపించాలి. వెంటనే మీ పోలింగ్ కేంద్రం వివరాలను ఎస్సెమ్మెస్‌ రూపంలో వెంటనే మీ ఫోన్‌కు పోలింగ్ కేంద్రం వివరాలు వస్తాయి. అంతేకాకుండా 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

* ‘ఓటర్ హెల్ప్‌లైన్‌’ యాప్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘానికి చెందిన ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని మీ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వివరాలు పొందొచ్చు.

* అలాగే ఎన్నికల సంఘం వెబ్‌సైట్స్‌ అయిన.. www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in వెబ్‌సైట్స్‌ ద్వారా కూడా పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చు.

* ఇక ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.inలోకి వెళ్లి, అందులో ఉండే Ask Voter Sahaya Mithra చాట్‌బాట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

ఓటర్‌ కార్డు లేకపోయినా పర్లేదు..

ఇక ఓటు వేయడానికి ఓటర్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ పాస్‌బుక్‌, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వంటి వాటిలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..