Viveka Murder Case: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. వాడివేడిగా సాగిన వాదనలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్‌పై గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు సాగాయి. హియర్ సే ఆధారాలను బట్టి నాపై ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా.. సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్‌పై గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు సాగాయి. హియర్ సే ఆధారాలను బట్టి నాపై ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ఆరోపించారు. గూగుల్ టెక్‌ఔట్ గురించి తెలియకుండానే సీబీఐ ఆధారపడుతోందని వివరించారు. ఏ కోర్టు కూడా గూగుల్ టేక్ఔట్‌ను ఆధారంగా పరిగణించదన్నారు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది. ఎప్పుడు దర్యాప్తుకు రమ్మన్నా వస్తాను, పూర్తిగా సహకరిస్తామన్నారు.
అరెస్ట్ చేయకుండా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని అవినాష్ తరఫు న్యాయవాది అన్నారు. ఇలాంటి ఆదేశాలిస్తే తప్పకుండా పాటిస్తామని అన్నారు. హత్య కేసులో ఉన్న వ్యక్తి ముందస్తు బెయిల్ ఎలా అడుగుతారు అని సునీత తరఫు లాయర్ ప్రశ్నించారు.
ముందస్తు బెయిల్ ఇవ్వాలంటే విచారణ సంస్థ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు సునీత తరఫు లాయర్. రెండు పార్టీ వాదనలు విన్న కోర్టు.. కేసు విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన హైకోర్టు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం