AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్కూల్లో అమ్మాయిల బాత్రూంలో మెరుస్తూ కనిపించిన పరికరం.. ఏంటా అని చూడగా

చెత్త వెదవలు.. కామాంధులు.. మారీచులు... ఎక్కడ చూడు వీళ్లే. అమ్మాయిలకు అస్సలు రక్షణ లేకుండా పోతుంది. గుడి, బడి, వీధి, వసతి గృహం.. ఇలా ఎక్కడపడితే అక్కడ పైశాచికం ప్రదర్శిస్తున్నారు నీచులు. వికృత చేష్టలతో రెచ్చిపోతూ.. అమ్మాయిలను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు..

Telangana: స్కూల్లో అమ్మాయిల బాత్రూంలో మెరుస్తూ కనిపించిన పరికరం.. ఏంటా అని చూడగా
School Washroom(Representative image)
Ram Naramaneni
|

Updated on: Oct 27, 2025 | 9:27 PM

Share

ఎక్కడ చూడు కామాంధులే. అమ్మాయిలకి అస్సలు రక్షణ లేదు. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయి వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి.. వికృత ఆనందం పొందే.. మారీచులు మరికొందరు. తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హిడెన్‌ కెమెరా కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూమ్‌లో  అటెండర్‌ యాకూబ్‌ సీక్రెట్ కెమెరాను పెట్టి.. వీడియోలు రికార్డు చేస్తున్నాడు.  బాత్రూమ్‌లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంటపడింది. ఏంటా అని చెక చేయగా.. రహస్య కెమెరా అని గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్‌కి, తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. బాత్రూమ్‌ నుంచి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న యాకూబ్ కోసం.. గాలింపు చేపట్టారు.

Also Read: ఆశ్చర్యం.. 3 పడగలు విప్పి తారసపడ్డ అరుదైన శ్వేతనాగు..