Telangana: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన ఆ ఎంపీ స్థానం.. పోటీలో హేమాహేమీలు.. ఎవరికి దక్కేనో.?

పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉంది. కనీసం 14 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేటలో పడింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛను రేవంత్‌కి అప్పచెప్తున్నట్లు కేసీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో గెలిచేవారి లిస్ట్ రెడీ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి పార్టీ..

Telangana: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన ఆ ఎంపీ స్థానం.. పోటీలో హేమాహేమీలు.. ఎవరికి దక్కేనో.?
Congress Party
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 20, 2024 | 1:02 PM

పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉంది. కనీసం 14 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేటలో పడింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛను రేవంత్‌కి అప్పచెప్తున్నట్లు కేసీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో గెలిచేవారి లిస్ట్ రెడీ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలుకు బాధ్యత అప్పచెప్పినట్టు సమాచారం. ఎంత కష్టమైన పని అయినా తన స్ట్రాటజీతో సక్సెస్ చేయడంలో దిట్ట అయిన రేవంత్ ఈ బాధ్యతను ఎలా డీల్ చేస్తారని కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. పదిహేడు నియోజకవర్గాల కోసం ఇప్పటికే సర్వేలు చేసిన సునీల్ కనుగోలు తన పూర్తి రిపోర్ట్ రేవంత్‌కి ఇచ్చారు. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యత పూర్తిగా రేవంత్‌పైనే ఉంది.

ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఒక హాట్ టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెలిచిన దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందు వరుసలో ఉంది. ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ 9 నియోజకవర్గాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఖమ్మం పార్లమెంట్ నుండి ఎవరు పోటీ చేసిన సులభంగా గెలుపొందే ఛాన్స్ ఉంది. అందుకే ఖమ్మం నుండి పోటీ చేయడానికి చాలా మంది రెడీ అయ్యారు. ఇదే అంశం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పోటీ చేయడానికి హేమ హేమీలు ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం ఖమ్మం టికెట్ ప్రయత్నిస్తున్నారు. ఇక పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్‌లతో పాటు పారిశ్రామిక వేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, హెల్త్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాస్ సైతం ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోనియా గాంధీ ఖమ్మం నుండి పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదట భావించారు. సోనియా ఖమ్మం నుండి పోటీ చేయాలని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఏకగ్రీవ తీర్మాణం చేశారు. అయితే సోనియా గాంధీ రాయ్ బరేలీ నుండి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఇక ఖమ్మం నుండి తనకి టికెట్ ఇవ్వాల్సిందేనని మరో కీలక నేత రేణుక చౌదరి పట్టు బట్టారు. కానీ రేణుక చౌదరికి తెలంగాణ నుండి రాజ్యసభ అవకాశం ఇవ్వడంతో ఆమె కూడా పోటీ నుండి తప్పుకున్నారు.

ముగ్గురు మంత్రులు తమ వారి కోసం ఒకే నియోజకవర్గ టికెట్ అడుగుతుండడంతో ఖమ్మం టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మం నుండి భారీ ర్యాలీగా వచ్చి గాంధీ భవన్‌లో అప్లికేషన్ సైతం పెట్టుకున్నారు. ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడు ఉపేందర్ కోసం టికెట్ అడుగుతున్నట్లు సమాచారం.

ఖమ్మం టికెట్ కోసం కాంగ్రెస్‌లోనే ఇంత మంది ఆశలు పెట్టుకోగా మరోవైపు సీపీఐ సైతం పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం తమకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇండియా కూటమి నుండి అందరూ బయటికి వెళుతున్నా.. తాము మాత్రం కాంగ్రెస్ గెలుపు కోసం కలిసే ఉంటున్నామని, ఖమ్మంలో తమకు క్యాడర్ ఉందని అక్కడ టికెట్ ఇస్తే గెలిచి తీరుతామని కమ్యూనిస్టులు చెబుతున్నారు. మరో వైపు సీపీఐ జాతీయ హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్న కారణంగా, జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు కావల్సినన్ని ఓట్లు ఖమ్మం నుండి తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు సునాయాసంగా గెలవచ్చని.. ఖమ్మం స్థానం పొత్తులో భాగంగా కేటాయించాలని సీపీఐ బలంగా కోరుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం రేవంత్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేద్దామని రేవంత్ ప్లాన్ చేసే సమయంలో ఖమ్మం పార్లమెంట్ కు ఎంపిక కత్తి మీద సాములాగా మారింది. ఇప్పుడు ముగ్గురు మంత్రులలో ఎవరి వైపు సీఎం మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ని ప్రయత్నాల్లో ఎవరు సక్సెస్ అయి టికెట్ దక్కించుకుంటారో చూడాలి.

ఇది చదవండి: ‘అరెస్ట్ అక్రమం’ అంటున్న ఎమ్మెల్సీ కవిత.. ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.