Watch Video: సామాన్యుడికి సెలబ్రిటీతో పరిచయం.. ఖండాలకు విస్తరించిన ఇతగాడి కళ..
ఇద్దరి అభిరుచులు వేరైనా.. వారి లక్ష్యం ఒక్కటే. ప్రపంచ స్థాయిలో గుర్తింపు కోసం ఖండాలు దాటిన స్నేహం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. అలాగే తన ఉన్న కళ నుంచి వచ్చిన ప్రఖ్యాతలతో పాటుగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని పట్టుపట్టాడు. అందుకోసం తనలోని నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుని ఒక శిల్పిగా మారాడు ఒక యువకుడు. తాను ఒక శిల్పి నే అని ప్రపంచానికి చూపించాడు.

ఇద్దరి అభిరుచులు వేరైనా.. వారి లక్ష్యం ఒక్కటే. ప్రపంచ స్థాయిలో గుర్తింపు కోసం ఖండాలు దాటిన స్నేహం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. అలాగే తన ఉన్న కళ నుంచి వచ్చిన ప్రఖ్యాతలతో పాటుగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని పట్టుపట్టాడు. అందుకోసం తనలోని నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుని ఒక శిల్పిగా మారాడు ఒక యువకుడు. తాను ఒక శిల్పి నే అని ప్రపంచానికి చూపించాడు. కాకపోతే అందరిలా రాళ్ల పై శిల్పాలు చెక్కే శిల్పి కాదు. అతి చిన్న పెన్సిల్ మోనలపై అద్భుతమైన కళా ఖండాలకు జీవం పోస్తాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గౌరీ శంకర్ అనే యువకుడు మైక్రో ఆర్టిస్ట్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు. తనకు ఉన్న అభిరుచిని సానబట్టి పెన్సిల్ లిడ్ మీద జాతీయ, అంతర్జాతీయ చిత్రాలకు రూపం పోశాడు. నైజీరియా దేశస్థుడు ప్రపంచ పాప్ సింగర్‌గాను, మోడల్‌గాను, సినీ పాటల రచయితగా, సినీ ఆర్టిస్టుగా రాణిస్తున్న నిక్సన్ అనే యువకుడితో సత్తుపల్లికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ గౌరీ శంకర్ల మధ్య స్నేహం బలపడింది.
వీరిద్దరి లక్ష్యం ఒక్కటే.. తాము చేసే పనిలో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. అందుకే వారి అభిరుచులు వేరైనా తమ లక్ష్య సాధన కోసం.. ఖండాలు దాటిన వీరి స్నేహం ఒక ఆల్బమ్‌గా రూపం దాల్చింది. ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో మైక్రో ఆర్టిస్ట్‌గా ఒక పెన్సిల్ మోనపై చెట్టు కొమ్మ మీద లైగర్ పడుకుని ఉన్న శిల్పం చెక్కుతూ ఉంటాడు. గౌరీ శంకర్‌తో పాటుగా నైజీరియా దేశస్థుడు పాప్ సింగర్ నిక్సన్ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆల్బమ్ చేశాడు. ఇలా ఇండియాలోని తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఒక మైక్రో ఆర్టిస్ట్, నైజీరియాలోని నిక్సన్ పాప్ సింగర్ తో కలిసి ఇద్దరి టాలెంట్‌ను ఒక వేదికగా చేసుకుని ఆల్బమ్ సాంగ్ చెయ్యడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చిన్నతనం నుంచి ప్రత్యేకతను చాటే గౌరీకి తన లక్ష్యం నెరవేరాలని సత్తుపల్లి ప్రాంతం వాసులు కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




