ఈ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థికి సొంతపార్టీలోనే కుంపటి..
అంతా ఆ నేత అనుకునట్లుగానే జరిగిందట. హమ్మయ్య అని ఊపిరి తీసుకునేలోపే, మళ్ళీ కొత్త సమస్యలు ఎదురువుతున్నాయట. తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనోవేదనకు గురి అవుతున్నరట ఆ సీనియర్ లీడర్. ఇంతంకీ ఎవరా సీనియర్. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది ప్రస్తుతం బీబీ పాటిల్ పరిస్థితి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీబీ పాటిల్ ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు.

అంతా ఆ నేత అనుకునట్లుగానే జరిగిందట. హమ్మయ్య అని ఊపిరి తీసుకునేలోపే, మళ్ళీ కొత్త సమస్యలు ఎదురువుతున్నాయట. తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనోవేదనకు గురి అవుతున్నరట ఆ సీనియర్ లీడర్. ఇంతంకీ ఎవరా సీనియర్. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మారింది ప్రస్తుతం బీబీ పాటిల్ పరిస్థితి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీబీ పాటిల్ ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరగానే ఆయనకు ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. జహీరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తా అంటేనే బీజీపీ పార్టీలో చేరుతా అని బీబీ పాటిల్ కండిషన్ పెట్టి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన కండిషన్‌ను ఒప్పుకొని బీజేపీ ఎంపీ టికెట్‌ను ఇచ్చింది.
అంతా ఆయన అనుకున్నట్లుగానే జరిగింది అని, ఇక ముందు కూడా ఇలాగే ఉంటుంది అని అనుకున్న బీబీ పాటిల్‌కి ఒకేసారి షాక్ తగిలినట్లు అయ్యింది. ఆ షాక్ ఏంటంటే.. బీజేపీ అగ్రనేతల వల్ల టికెట్ వచ్చింది కానీ, లోకల్‌గా ఉన్న బీజేపీ లీడర్లు ఎవరు బీబీ పాటిల్‌కు సహకరించడం లేదు. దీంతో టికెట్ వచ్చిన సంతోషం కూడా ఇప్పుడు ఆయనకు లేదట. బీబీపాటిల్ రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి జహీరాబాద్ ఎంపీగా గెలిచారు. మళ్ళీ తాను బీఆర్ఎస్ పార్టీ నుండే పోటీ చేస్తారని అందరూ ఉహించారు. బీజేపీ పార్టీ నుండి కొంత మంది ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ, బీబీ పాటిల్ బీజేపీలో చేరి టికెట్ తీసుకుపోవడంతో బీజేపీ నుండి టికెట్ ఆశించిన వారందరు షాక్‌కి గురిఅయ్యారు. పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీలో చేరడం.. టికెట్ రావడం అంత చకచకా జరిగిపోయింది.
ఇప్పుడు బీబీ పాటిల్‌కి సొంత పార్టీ నేతలే సహకరించడం లేదు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం మేము కష్టపడితే, నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన బీబీ పాటిల్‌కి టికెట్ రావడం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కొంతమంది బీజేపీ సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ మీద ప్రేమ వదులుకోలేక బీబీ పాటిల్‌కి సహకరించలేక పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. టికెట్ వచ్చాక తొలిసారి జహీరాబాద్‌కి వచ్చిన బీబీ పాటిల్ స్వాగతం పలకడానికి సీనియర్ లీడర్లు ఎవరు రాలేదు. కింది స్థాయి నేతలే కొంత హడావుడి చేసారు. ఇక బీజేపీ టికెట్ ఆశించిన జైపాల్ రెడ్డి అయితే ఇప్పటి వరకు బీబీ పాటిల్‌ను కలవనే లేదు. పాటిల్ జహీరాబాద్‌కి వస్తే జైపాల్ రెడ్డి హైదరాబాద్‌కి వెళ్లారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల సీనియర్ నేతలు బీబీ పాటిల్ కోసం పనిచేయడం లేదు. పాటిల్ ఏదైనా కార్యక్రమం చేసినా దానికి ముఖ్యనేతలు గైర్హాజర్ అవ్వడంతో పాటు తమ అనుచరులకు కూడా వెళ్లవద్దని చెపుతున్నారట. దీనికి తోడు బీబీ పాటిల్ కూడా అందర్నీ కలుపుకొని పోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
బీబీ పాటిల్ కూడా ఎవరితో సరిగ్గా మాట్లాకుండా తనకు తోచిన విధంగా ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారు సీనియర్లు. అయితే బీబీ పాటిల్ బీజేపీలోకి చేరడానికి ముందు నుండే చాలా మంది నేతలు అతన్ని పార్టీలోకి తీసుకోవద్దు అని బీజేపీ రాష్ట్ర నాయకత్వంకి పలుమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పార్టీలోకి చేర్చుకోవడం టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని, పార్టీ నాయకత్వం చెప్పినా కూడా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని చాలామంది బీజేపీ సీనియర్లు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారట. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీలో ప్రస్తుతం పరిస్థితి సరిగ్గా లేదు అని, ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలా ఎవరికి వారు యామున తీరు అన్నట్లుగా వ్యవహరిస్తే వచ్చే ఎంపీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందంటున్నారు నాయకులు. ఇప్పటికైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం జహీరాబాద్ పార్లమెంట్‌పై దృష్టి సారించాలని.. ఇలాగే వదిలేస్తే ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




