Harish Rao: శాంతిభద్రతలు క్షీణించాయి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: హరీష్‌రావు

రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు స్పందించారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ ట్వీట్‌ చేశారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.. అంటూ హరీష్ రావు అన్నారు.

Harish Rao: శాంతిభద్రతలు క్షీణించాయి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: హరీష్‌రావు
Harish Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 19, 2024 | 2:57 PM

రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు స్పందించారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ ట్వీట్‌ చేశారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.. అంటూ హరీష్ రావు అన్నారు. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌ రావు వెల్లడించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలపై హరీష్ రావు ఏమన్నారంటే..

దీంతోపాటు.. రాష్ట్రంలో శాంతిభద్రతలపై కూడా హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘‘గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరచిపోక ముందే, మరో దారుణం చోటుచేసుకున్నది. రక్షించాల్సిన పోలీసే, తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షంచే దుర్ఘటన నిన్న భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గత పదేళ్ళలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకమవటం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నాం..’’ అంటూ హరీశ్ రావు ట్వీట్ లో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..