AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Graduate MLC Elections: తెలంగాణలో హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మహిళా దినోత్సవం రోజున ‘గాజు’లతో ఓటర్లకు గాలం!

Graduate MLC Elections: తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నా కొద్ది..

Graduate MLC Elections: తెలంగాణలో హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మహిళా దినోత్సవం రోజున ‘గాజు’లతో ఓటర్లకు గాలం!
Shiva Prajapati
|

Updated on: Mar 08, 2021 | 11:12 PM

Share

Graduate MLC Elections: తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నా కొద్ది ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయోగాలకు తెరలేపారు. ఇక ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో దీనిని కూడా తమ ఎన్నికల ప్రచారంగా వినియోగించుకుంటున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా వివిధ పార్టీల ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలుగా మారాయి. ఎప్పుడూ సాదాసీదాగా జరిగే మహిళా దినోత్సవానికి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసి రావడంతో హంగు ఆర్భాటాలతో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రధానంగా చూసుకుంటే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అధికార తెరాస పార్టీ తరపున ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమం సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న తదితరులు సమావేశానికి హాజరయ్యారు. మహిళలకు కు స్వీట్స్ తో పాటు గాజులు పంపిణీ చేయడం గమనార్హం. ఏకంగా ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి పేరుతో ప్రత్యేకంగా చేయించిన స్టికర్ లతో స్వీట్ బాక్స్‌లతో పాటు గాజులు పంపిణీ చేశారు. గాజులు పంపిణీ చేసిన విషయం తాండూరులో తీవ్ర చర్చనీయాంశమైంది. మహిళలందరి మద్దతు కోసం టీఆర్ఎస్ అభ్యర్థి ఇలా వినూత్నంగా గాజులు పంచి ప్రచారం చేస్తున్నారు. మహిళలకు గాజులు ఎంత ప్రాముఖ్యతనిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకునే టీఆర్ఎస్ అభ్యర్థి అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశారని రాజకీయ వర్గాల టాక్.

Also read:

AP Municipal Elections: ఆ ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి.. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..