AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మద్దతుగా వచ్చిన వారినే మడతపెట్టి మరీ కొడుతున్నారు.

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో టీడీపీ నేత.. మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు.. వీడియో వైరల్..
Follow us

|

Updated on: Mar 08, 2021 | 4:22 PM

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. మద్దతుగా వచ్చిన వారినే మడతపెట్టి మరీ కొడుతున్నారు. మహిళా దినోత్సవం రోజునే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఓ మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజపతిరాజు వెంట టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. అయితే, ఓ మహిళా కార్యకర్త తమ అభిమాన నేత వచ్చాడనే సంతోషంలో అశోక్ గజపతి రాజుపై పుష్పాలు జల్లింది. అయితే, పక్కనే ఉన్న మరో మహిళా కార్యకర్త ఆమెను వారించింది.

ఆ సమయంలోనే సహనం కోల్పోయిన అశోక్ గజపతి రాజు సదరు మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఆమె చేతిలో ఉన్న పుష్పాలను కింద పడేసి ఆమెను కొట్టారు. ఆ ఘటనను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తి ఓ మహిళపై చేయి చేసుకోవడం ఏంటి? అది కూడా సొంత పార్టీ కార్యకర్తను కొట్టడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, అశోక్‌ గజపతి రాజు చేయి చేసుకోవడంతో సదరు టీడీపీ మహిళా కార్యకర్త వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇదిలాఉంటే.. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ టీడీపీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన విషయం తెలిసిందే.

Also read:

Director Sukumar : ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాలో కచ్చితంగా తెలుగమ్మాయే హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Sreekaram Movie : శ్రీకారం వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి.. ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..

Bengal Polls: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ