AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Sukumar : ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాలో కచ్చితంగా తెలుగమ్మాయే హీరోయిన్.. ఎందుకో తెలుసా..?

Director Sukumar: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, స్టైలింగ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిసి 'పుష్ప' అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ క్యూటీ రష్మిక మందన్నా బన్నీతో జోడీ కడుతోంది.

Director Sukumar : ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాలో కచ్చితంగా తెలుగమ్మాయే హీరోయిన్.. ఎందుకో తెలుసా..?
uppula Raju
|

Updated on: Mar 08, 2021 | 3:01 PM

Share

Director Sukumar: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, స్టైలింగ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిసి ‘పుష్ప’ అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ క్యూటీ రష్మిక మందన్నా బన్నీతో జోడీ కడుతోంది. అయితే మొదట్లో ఈ చిత్రంలో రష్మికను కాకుండా అచ్చమైన తెలుగమ్మాయినే తీసుకోవాలనుకున్నారట. అల్లు అర్జున్‌ కూడా తెలుగు హీరోయినే కావాలని పట్టుబడ్డాడట. కానీ కొన్ని కారణాల రీత్యా రష్మికనే తీసుకున్నామని చెప్పుకొచ్చాడు సుకుమార్‌. ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌ స్నేహితుడు హరిప్రసాద్‌ జక్కా నిర్మించిన ప్లేబ్యాక్‌ సినిమా ఇటీవలే రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో చిత్రయూనిట్‌ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. దీనికి సుకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్లేబ్యాక్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్యపై ప్రశంసలు కురిపించాడు.

“అనన్య చాలా సహజంగా నటించింది. అయితే తెలుగు రాని హీరోయిన్లను పెట్టుకుంటే వారితో డైలాగులు చెప్పించడం కొంత కష్టం. అందుకే నా సినిమాల్లో ఎక్కువగా తెలుగు వచ్చినవాళ్లనే పెట్టుకున్నా. రంగస్థలంలో సమంత, ప్రకాశ్‌రాజ్‌ తప్ప అందరూ తెలుగువాళ్లే. కానీ వీళ్లిద్దరు కూడా తెలుగులో డైలాగ్స్‌ ఈజీగా చెప్పేవారు. నా తర్వాతి సినిమాలో తప్పకుండా తెలుగమ్మాయినే హీరోయిన్‌గా పెట్టుకుంటాను. ఇది నా ప్రామిస్‌. పుష్ప సినిమాలో తెలుగమ్మాయిని పెట్టమని బన్నీ చెప్పాడు. అంత పెద్ద హీరో ఈ మాట చెప్పడం సాధారణ విషయం కాదు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వచ్చిన రష్మికను పెట్టుకున్నాను” అని చెప్పుకొచ్చాడు.

సుకుమార్, విజయ్ దేవర కొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ! జవాన్ పాత్రలో మెరవబోతున్న..

Sreekaram Movie : శ్రీకారం వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి.. ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?