సుకుమార్, విజయ్ దేవర కొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ! జవాన్ పాత్రలో మెరవబోతున్న..

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా రెడీ కాబోతుంది. ప్రస్తుతం సుకుమార్

  • uppula Raju
  • Publish Date - 12:22 pm, Mon, 18 January 21
సుకుమార్, విజయ్ దేవర కొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ!  జవాన్ పాత్రలో మెరవబోతున్న..

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా రెడీ కాబోతుంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా బిజీలో ఉండగా, విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లిగర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు కలిసి క్రేజీ కాంబినేషన్ ప్రకటించారు.

అయితే ఈ సినిమా కథ గురించి టాలీవుడ్‌ ఓ విషయం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా పిరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన అప్పటి పరిస్థుతుల ఆధారంగా జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం… ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఆ జవాన్ పాత్రలోనే విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 150 కోట్ల బడ్జెట్లో నిర్మించనున్నారు.

పుష్ప’ గురించి క్రేజీ న్యూస్‌.. బన్నీకి విలన్‌గా చియాన్ విక్రమ్‌.. త్వరలోనే అధికారిక ప్రకటన..!