టాలీవుడ్ క్యూట్ క‌పుల్… స్వీట్ కామెంట్స్‌… చైతూ ఫోటోపై సామ్ ఏ విధంగా స్పందించిందంటే..?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్... స్వీట్ కామెంట్స్‌... చైతూ ఫోటోపై సామ్ ఏ విధంగా స్పందించిందంటే..?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య. ఈ జంట సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవ‌ల ఈ జంట ఓటీటీ వేదిక...

TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Jan 18, 2021 | 2:26 PM

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య. ఈ జంట సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవ‌ల ఈ జంట ఓటీటీ వేదిక ఆహాపై సంద‌డి చేశారు. తాజాగా నాగ చైత‌న్య త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేయ‌గా, దానికి స‌మంత ఇచ్చిన చిలిపి కామెంట్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

పీసీ శ్రీ‌రామ్ ఫోటోగ్రాఫ‌ర్‌…

నాగ చైత‌న్య ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ చైతూని ఫొటో తీయ‌గా, దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు నాగ చైత‌న్య‌. చీక‌ట్లో కూర్చొని దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, ఈ ఫొటోకు నెటిజ‌న్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. స‌మంత.. నా గురించే ఆలోచిస్తున్నావా అంటూ ఫ‌న్నీ కామెంట్ పెట్ట‌గా, ఈ పోస్ట్ ప్ర‌స్తుతం అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటోంది.

నాగ‌చైత‌న్య ఇన్‌స్టాగ్రాం పోస్ట్ ఇదే…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu