AP Municipal Elections: ఆ ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి.. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..

AP Municipal Elections: వైపీసీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కు సోమవారం నాడు ఫిర్యాదు..

AP Municipal Elections: ఆ ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి.. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..
Follow us

|

Updated on: Mar 08, 2021 | 10:53 PM

AP Municipal Elections: వైపీసీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా మైదుకూరు మునిసిపాలిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు, పోలీసులు దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. మైదుకూరులో టీడీపీ అభ్యర్థులుు ప్రచారం చేసుకోకుండా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే అధికార వైసీపీ నాయకులు పోలీసులతో చేతులు కలిపి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. మైదుకూరు డీఎస్పీ బి. విజయ్ కుమార్, సీఐ మధుసూధన్ గౌడ్, ఎస్.ఐ సుబ్బారావులు టీడీపీ అభ్యర్ధలను, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా పోలీసు అధికారులు టీడీపీ అభ్యర్ధులకు పోన్లు చేసి బెదిరిస్తున్నారని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఇక మైదుకూరు కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి పివి రామకృష్ణ అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించారు. మైదుకూరు 9వ డివిజన్ టీడీపీ అభ్యర్థి డి. జగన్మోహన్‌పై పోలీసుల అండతోనే అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఇక టీడీపీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్యం వెంకట్ సుబ్బారెడ్డి లపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్, దొంగసారా, గంజాయి, అక్రమ ఎర్రచందనం లాంటి కేసులు బనాయించి లోపల వేస్తామని టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఈసీకి తెలిపారు.

మైదుకూరులో శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని చంద్రబాబు ఎస్ఈసీని కోరారు. బెదిరింపులు, అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్ కమిషనర్, పోలీసు అధికారులపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు, నాయకులు, సానుభూతిపరులుపై నమోదైన తప్పుడు కేసులను కొట్టివేయాలని కోరారు. ఇక పోలింగ్, లెక్కింపు సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు, నిరంతర వీడియో రికార్డ్ చేయాలన్నారు. శాంతియుతంగా, న్యాయబద్దంగా ఎన్నికలు నిర్వహించడానికి మైదుకూర్ మునిసిపాలిటీలోని టీడీపీ అభ్యర్థులకు అదనపు బలగాలతో భద్రత కల్పించాలని ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.

Also read:

Road Mishap: ముందు బస్సు.. వెనుక లారీ.. ఒక్కసారిగా ఫెయిల్ అయిన బ్రేకులు.. క్షణంలో అంతా గందరగోళం..

Mango Health Benefits : పండ్లలలో రారాజు.. మామిడి పండు వచ్చేసింది.. మరి ఈ పండుతినడం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా..!

Latest Articles