AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఛాతిలో నొప్పి వస్తే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు.. ఆ తర్వాత క్లాసులో పాఠాలు చెబుతూ

మనిషి గుండె ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగుతుందో అర్థం కావడం లేదు. రీసెంట్ టైమ్స్‌లో హర్ట్ ఎటాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. కళ్లముందే కుప్పకూలి ప్రాణాలిడుస్తున్నారు. ఏ క్షణమైనా ఎవ్వరికైనా హార్ట్‌ ఎటాక్‌ వస్తోంది. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్ప కూలిపోతున్నారు. ఏమైందో చూసే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా...

Telangana: ఛాతిలో నొప్పి వస్తే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు.. ఆ తర్వాత క్లాసులో పాఠాలు చెబుతూ
Pilli Ramesh
N Narayana Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 20, 2025 | 3:31 PM

Share

ప్రస్తుతకాలంలో రోజురోజుకీ గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ వయస్సు..ఈ వయస్సు అనే తేడా లేకుండా..చిన్న పిల్లలు నుంచి పెద్ద వయస్సు వరకు హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు..ఇది ఆందోళన కలిగిస్తోంది..ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, ఆహారపు అలవాట్లు ఇవ్వన్నీ గుండెపోటుకు కారణం అవుతున్నాయి..అప్పటి వరకు హుషారుగా పని చేస్తూ..అందరితో కలివిడిగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు..

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో క్లాస్ రూమ్‌లో పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుడు పిల్లి రమేష్(44) ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దీంతో విద్యార్థులు ,తోటి ఉపాధ్యాయులు.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రమేష్ ప్రతి రోజూ ఖమ్మం నుంచి ఇల్లందు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం ఉదయం ఉపాధ్యాయుడు రమేష్ ఎప్పటి లాగానే ఇల్లందుకు చేరుకోగానే చాతిలో కొంచెం నొప్పి అనిపించడంతో.. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి గ్యాస్ సమస్యకు సంబంధించిన టాబ్లెట్స్ తీసుకొని వేసుకున్నారు. కాస్త ఉపశమనం అనిపించగానే పాఠశాలకు వెళ్లాడు. పాఠశాలకు వెళ్లి క్లాస్ రూమ్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

తోటి ఉపాధ్యాయులు ఆయన్ను హుటాహుటిన ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు సిపిఆర్ చేసి విశ్వప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. పరీక్షించిన వైద్యులు ఉపాధ్యాయుడు మృతి చెందాడని తెలపగానే తోటి ఉపాధ్యాయులు , విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతి చెందిన ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్‌ హోదాలో ఫిజిక్స్ బోధిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.