AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇకపై బీర్లు ఏరులై పారాల్సిందే.. తెలంగాణ మందుబాబులకు పండుగలాంటి వార్త

తెలంగాణలో కింగ్‌ ఫిషర్ బీర్ ప్రియులకు గుడ్‌న్యూస్. యథాతథంగా బీర్ల సరఫరా చేస్తున్నట్లు UBL ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బీర్లను పునరుద్ధరిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం ప్రకటించామని సంస్థ తెలిపింది. 

Telangana: ఇకపై బీర్లు ఏరులై పారాల్సిందే.. తెలంగాణ మందుబాబులకు పండుగలాంటి వార్త
Kingfisher Beer
Ravi Kiran
|

Updated on: Jan 20, 2025 | 8:01 PM

Share

తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు గుడ్‌న్యూస్. ఇకపై బీర్లు ఏరులై పారాల్సిందే. కింగ్ ఫిషర్ బీర్ల కోసం బెంగపెట్టుకున్న వారికి ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. దీనిపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా యధాతథంగా కొనసాగిస్తున్నట్లు BSEకి లేఖ రాసింది. బీర్ల సప్లై నిలిపిస్తున్నట్టు జనవరి 8న UBL ప్రకటించింది. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపింది. ధరల పెరుగుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు సమస్య నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందంటూ లేఖ పేర్కొంది.

ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారిస్తామని హామీ రావడంతో బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామంది. వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నామన్నారు. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకువస్తామని సంస్థ ప్రకటించింది. కింగ్ ఫిషర్, హెనికేన్ సహా పలు టాప్ బ్రాండ్లను తెలంగాణ బేవరీస్‌కి సప్లై చేస్తోంది UBL. తెలంగాణకి మద్యం సరఫరా చేస్తున్న 6 కంపెనీల్లో 70 శాతం UBL నుంచి సప్లై అవుతుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు