Governor Tamilisai: వస్తానని చెప్పారు.. ఎందుకు రాలేదో తెలియదు.. సీఎం కేసీఆర్ రాకపోవడంపై స్పందించిన గవర్నర్..

Governor Tamilisai: గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌(Governor Tamilisai) అన్నారు. సీఎం కేసీఆర్ ఏడు గంటలకు వస్తారని సమాచారం ఇచ్చారని అన్నారు. సీఎం రాక కోసం..

Governor Tamilisai: వస్తానని చెప్పారు.. ఎందుకు రాలేదో తెలియదు.. సీఎం కేసీఆర్ రాకపోవడంపై స్పందించిన గవర్నర్..
Cm Kcr Governor Tamilisai
Sanjay Kasula

|

Aug 15, 2022 | 9:44 PM

సీఎం కేసీఆర్(CM KCR) ఎందుకు రాలేదో తెలియదని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌(Governor Tamilisai) అన్నారు. సీఎం కేసీఆర్ ఏడు గంటలకు వస్తారని సమాచారం ఇచ్చారని అన్నారు. సీఎం రాక కోసం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అరగంటపాటు ఎదురు చూశా.రు తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. ఆఖరి నిమిషంలో ఎట్‌హోమ్‌ కార్యక్రమాన్ని కేసీఆర్‌ రద్దు చేసుకున్నారు. గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందుకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాలేదు.

ఎమ్మెల్సీ రమణ, బీజేపీ ఎంపీ అరవింద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రఘు నందన్ రావు, రాంచందర్రావు, ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రముఖ నేతలు కూడా కనిపించలేదు. ఇక కరోనా కారణంగా తేనేటి విందుకు హాజరు కాలేకపోతున్నట్లుగా పీసీసీ రేవంత్ రెడ్డి, పాదయాత్ర కారణంగా బండి సంజయ్ రాలేకపోయారు.

రాజ్‌భవన్‌లో ఆనవాయితీగా నిర్వహించే ఎట్‌హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నారని అంతా అనుకున్నారు. 2020 జనవరి 26 గణతంత్రదినోత్సవం రోజున ఒకేఒక్కసారి కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కి వెళ్లారు. ఆ తర్వాత కరోనా కారణంగా 2021లో ఆగస్ట్ 15న గానీ, జనవరి 26న గానీ ఆనవాయితీ కొనసాగలేదు. 2022 జనవరి 26న ఎట్‌హోమ్‌కి కేసీఆర్ హాజరుకాలేదు. అంతెందుకు ఆ రోజు.. గవర్నర్‌ నిర్వహించిన జెండావందనానికీ కేసీఆర్ హాజరుకాని సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu