Viral: ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. తలుపు తీసి చూడగా షాక్.. వామ్మో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
అడవుల్లో తిరిగే భారీ నాగు పాములు ఇపుడు జనావాసాల్లోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్న పామును చూస్తేనే భయంతో హడలెత్తి పోతాము. అలాంటిదో ఓ భారీ నాగుపాము ఇంట్లో పడగవిప్పి బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది.

అడవుల్లో తిరిగే భారీ నాగు పాములు ఇపుడు జనావాసాల్లోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్న పామును చూస్తేనే భయంతో హడలెత్తి పోతాము. అలాంటిదో ఓ భారీ నాగుపాము ఇంట్లో పడగవిప్పి బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఓసారి ఊహించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తెలగ రామవరం పంచాయతీలోని నారసాని నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లో నాగుపాము చొరబడింది. ఆ ఇంటి మహిళ ఎప్పటిలాగే వంట చేసేందుకు కిచెన్‌లోకి వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు అక్కడ వింతగా శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని అంతా పరిశీలించింది. గ్యాస్ గానీ లీకవుతుందేమోనని చెక్ చేసింది. అలాంటిదేమీ లేకపోగా శబ్దాలు కంటిన్యూ అవుతుండటంతో అనుమానించిన ఆమె పక్కనే ఉన్న బీరువా పైకి చూసింది.

Snake
అంతే ఒక్క ఉదుటన కిచెన్‌లోంచి ఇవతలికి వచ్చేసింది. బీరువాపై ఓ పెద్ద నాగుపాము పడగవిప్పి కూర్చుని బుసలుకొడుతోంది. ఇంట్లోవారికి విషయం చెప్పింది. అంత పెద్దపామును చూసిన వారికి నోటమాట రాలేదు. విషయం తెలుసుకుని చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. కొందరు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మహేష్, పి.బలరాం పామును చాకచక్యంగా బంధించి అడవిలో వదిలిపెట్టారు.
వీడియో చూడండి..
శుక్రవారం తమ ఇంటి ఆవరణలో ఈ పాము కనిపించిందని, వెళ్లిపోతుందిలే అనుకుంటే తెల్లారేసరికి బీరువాపైకి ఎక్కి బుసలు కొడుతూ కనిపించిం దని నర్సయ్య తెలిపారు. పామును బంధించి అడవిలో వదిలివేయడంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
