AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: భార్య వివాహేతర సంబంధానికి బలైపోయిన డాక్టర్‌.. 8 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ..

భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చిమరీ భర్తపై ఎటాక్‌ చేయించింది భార్య. వరంగల్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రగాయాలతో 8 రోజులుగా మృత్యువుతో పోరాడిన యువ డాక్టర్ శనివారం కన్నుమూశాడు..

Warangal: భార్య వివాహేతర సంబంధానికి బలైపోయిన డాక్టర్‌.. 8 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2025 | 11:12 AM

Share

భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చిమరీ భర్తపై ఎటాక్‌ చేయించింది భార్య. వరంగల్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రగాయాలతో 8 రోజులుగా మృత్యువుతో పోరాడిన యువ డాక్టర్ శనివారం కన్నుమూశాడు.. గతనెల 20న సుమంత్‌ రెడ్డిపై దాడి జరగగా.. 8 రోజుల నుంచి సుమంత్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ క్రమంలో శనివారం డాక్టర్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

అసలేం జరిగిందంటే..

గతనెల 20న వరంగల్‌ – భట్టుపల్లి ప్రధాన రహదారిపై డాక్టర్‌ సుమంత్‌రెడ్డి కారును అడ్డగించి.. ఇనుప రాడ్లతో ఎటాక్‌ చేశారు ముగ్గురు దుండగులు. కారులో నుంచి కిందకి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్న సుమంత్‌రెడ్డిని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న సుమంత్‌ని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. భార్యే.. సుమంత్‌పై ఎటాక్‌ చేయించిందని తెలుసుకుని అవాక్కయ్యారు.

ఈ కేసులో సుమంత్‌రెడ్డి భార్య ఫ్లోరా మరియాతోపాటు ఆమె ప్రియుడు శామ్యూల్‌.. సహకరించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. దాడి జరిగిన ఐదు రోజుల్లోనే నిందితులను అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు పోలీసులు. అయితే, భార్యే.. భర్తను దారుణంగా చంపించడం వరంగల్‌లో సంచలనంగా మారింది.

సుమంత్‌రెడ్డి – ఫ్లోరా మరియాకు 2016లో పెళ్లయింది.. సంగారెడ్డిలో ఉన్నప్పుడు జిమ్ ట్రైనర్‌ శామ్యూల్‌తో ఫ్లోరా మరియాకి ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో, భర్తను అడ్డుతొలగించుకుంటే.. ప్రియుడితో కలిసి ఉండొచ్చని.. సుమంత్‌రెడ్డి మర్డర్‌కి ప్లాన్‌ చేసింది మరియా.

మర్డర్‌ చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్-A, ప్లాన్-B.. రెడీ చేసుకున్నారు. అయితే, యాక్సిడెంట్ చేసి చంపాలన్న ప్లాన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో ప్లాన్‌-B అమలు చేశారు.

చివరికి, ఫ్లోరా మరియా.. పాపం పండి ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతోంది. మరియాతోపాటు ఆమె ప్రియుడు శామ్యూల్‌, వాళ్లకు సహకరించిన AR హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌ను కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు.. కాగా.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..