Ganesh Immersion 2021: ఓ భక్తుడి వినూత్న ప్రయత్నం.. ఇలా కూడా వినాయక నిమజ్జనం చేస్తారా అంటూ షాక్ అవుతున్న జనాలు..!
Ganesh Immersion 2021: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తొమ్మిది రోజుల పాటు ప్రజలచే..
Ganesh Immersion 2021: రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తొమ్మిది రోజుల పాటు ప్రజలచే పూజలు అందుకున్న గణనాథులు.. నవరాత్రులను పూర్తి చేసుకుని ఇవాళ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణేషుడు ఇప్పటికే గంగ ఒడికి చేరగా.. మరెన్నో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు తెగ సందడి చేస్తున్నారు. ఇదిలాఉంటే.. సంగారెడ్డి జిల్లాలోని వావిలాల గ్రామానికి చెందిన ఓ భక్తులు వినూత్న రీతిలో వినాయక నిమజ్జనానికి బయలుదేరాడు. గణనాథుడిని ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం చేయడానికి వెరైటీకగా బయలుదేరి వచ్చాడు.
వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా వావిలాల గ్రామానికి చెందిన భక్తులు లక్ష్మణ్.. స్కేటింగ్ షూస్ వేసుకుని వినాయకుడిని తన ఒడిలో పెట్టుకుని నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు బయలుదేరాడు. రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వినాయక నిమజ్జనం చేశారు. అయితే, లక్ష్మణ్.. ఇలా రావడం ఇదే తొలిసారి కాదు. గత ఐదు సంవత్సరాలుగా వివాలాల గ్రామం నుంచి గణేషుడిని తీసుకుని ట్యాంక్ బండ్‌లో చేస్తూ వస్తున్నాడు. తన తండ్రి, గ్రామ సర్పంచ్, స్థానికుల సహకారంతో ప్రతీ సంవత్సరం గణనాథులను తీసునుకుని స్కేటింగ్ చేస్తూ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటానని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఉదయం ఏడు గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల లోపు ట్యాంక్ బండ్‌కు చేరుకుని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. కరోనాను పూర్తిగా పోగొట్టాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని కోరుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
Video:
Also read:
Balineni – Peddireddy: వైసిపి విజయం ముందే ఊహించాం: మంత్రులు బాలినేని, పెద్దిరెడ్డి