Balineni – Peddireddy: వైసిపి విజయం ముందే ఊహించాం: మంత్రులు బాలినేని, పెద్దిరెడ్డి

వైసిపి విజయం ముందే ఊహించామని ఎపి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రకాశంజిల్లాలో మొత్తం..

Balineni - Peddireddy: వైసిపి విజయం ముందే ఊహించాం: మంత్రులు బాలినేని, పెద్దిరెడ్డి
Peddi Reddy And Balilneni
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 19, 2021 | 9:04 PM

Balineni Srinivasa Reddy: వైసిపి విజయం ముందే ఊహించామని ఎపి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రకాశంజిల్లాలో మొత్తం 55 జడ్‌పిటిసి స్థానాల్లో ఎన్నికలు జరిగితే, మొత్తం 55 స్థానాలు వైసిపి కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసిందన్నారు. ఎంపిటిసి స్థానాల్లో కూడా 95 శాతానికి పైగా ఎంపిటిసి స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాశానికి అనుగుణంగా మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని మంత్రి చెప్పారు.

వందశాతం విజయం సాధించి వైసిపి పార్టీ చరిత్ర సృష్టించిందని మంత్రి వెల్లడించారు. గత మున్సిపల్‌ ఎన్నికలు, ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లో కూడా వైసిపి క్లీన్‌ స్వీప్‌ చేసిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు వేగవంతం చేస్తామని మంత్రి బాలినేని తెలిపారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఎన్నికల ఫలితాలపై స్పందించారు. టీడీపీ భవిష్యత్‌ చెప్పడానికి కుప్పం ఫలితం ఒక్కటి చాలన్నారాయన. వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను అనేక విడతల్లో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ నిర్వహించారు. అంతకుముందు ప్రారంభించి మొదలుపెట్టిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపలేదు. వాటి గురించి నిమ్మగడ్డ ప్రస్తావించలేదని అన్నారు.

2014 సాధారణ ఎన్నికలకు మూడు నెలల ముందు కిరణ్‌ కుమార్, చంద్రబాబు ఒక్కటై స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించారు.. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడితే టీడీపీకి ఊపిరిపోస్తాయని ఎన్నికల ఆలోచన చేశారు అని పెద్ది రెడ్డి చెప్పారు.

కిరణ్‌ కుమార్ ఆనాడు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద ప్రేమ, అభిమానం ఏమీ లేదు. చంద్రబాబుకు బంట్రోతుగా గెలిపించాలని కిరణ్‌ కుమార్ ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే ఎన్నికల్లో ఉంటే ఓట్లు విడిపోవని చెప్పులు నెత్తిన పెట్టుకొని చెప్పులతో పోటీ చేసిన ఘనత కిరణ్‌ కుమార్‌ రెడ్డిది అని పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read also: Kannababu: ఏ ముహూర్తాన అన్నారో.. అచ్చెన్నాయుడి ఆ మాటలే నిజమవుతున్నాయి: ఏపీ మంత్రి కన్నబాబు