Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannababu: ఏ ముహూర్తాన అన్నారో.. అచ్చెన్నాయుడి ఆ మాటలే నిజమవుతున్నాయి: ఏపీ మంత్రి కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన అన్నారో.. ఆ మాటలే అక్షర సత్యమ‌వుతున్నాయ‌ని వ్యవసాయశాఖ మంత్రి

Kannababu: ఏ ముహూర్తాన అన్నారో.. అచ్చెన్నాయుడి ఆ మాటలే నిజమవుతున్నాయి: ఏపీ మంత్రి కన్నబాబు
Kannababu
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 19, 2021 | 6:56 PM

Kurasala Kannababu: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన అన్నారో.. ఆ మాటలే అక్షర సత్యమ‌వుతున్నాయ‌ని వ్యవసాయశాఖ మంత్రి కుర‌సాల క‌న్నబాబు చెప్పుకొచ్చారు. “పార్టీ లేదు.. బొక్కా లేద‌ు” అని అచ్చెన్నాయుడు అనిన దగ్గర్నుంచి ప్రతీ ఎన్నికలోనూ అదే నిజమవుతోందని కురసాల ఎద్దేవా చేశారు. ఏపీలో పరిషత్‌ ఎన్నికల ఫలితాల తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయాల పరంపరం కొనసాగుతోందని కన్నబాబు అన్నారు. ఏ స్థానిక ఎన్నికల ఫలితాలు చూసినా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోందన్నారు.

ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అయితే, ఈ రోజు తాము బహిష్కరించాం కాబట్టే వైఎస్సార్సీపీ గెలిచిందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కానీ అప్పుడు టీడీపీ అన్ని ఎన్నికల్లో పాల్గొన్నారని, బీఫామ్ ఇచ్చారని, ప్రచారాలు చేశారని అన్నారు. ఇప్పుడు బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరని అన్నారు. మున్సిపాలిటీల్లో ఒక్క తాడిపత్రి తప్ప అన్ని చోట్లా వైఎస్సార్సీపీ గెలిచిందని చెప్పారు.

“మీరు అమితంగా ప్రేమిస్తున్న అమరావతిలోనే మీకు మద్దతు లభించలేదు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఒకే రకమైన ఫలితాలు వస్తున్నాయి. 13కి 13 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటాం. ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికలకు వెళదాం రండి అంటున్నారు. ఇవన్నీ ఎన్నికలు కాదా…? సిగ్గులేదా.. ఓటమిని ఒప్పుకోండి. మేము లేస్తే మా అంత వస్తాదులు లేరని తొడగొట్టడం మానండి.” అని మంత్రి కురసాల అన్నారు.

Read also: Somireddy: ఎక్కువ స్ధానాలు గెలిచామని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది: సోమిరెడ్డి

ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!