Somireddy: ఎక్కువ స్ధానాలు గెలిచామని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది: సోమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లోని మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్ధానాలు గెలిచిందని వైసీపీ మంత్రులు..

Somireddy Chandra Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లోని మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్ధానాలు గెలిచిందని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి అమరావతి సోమిరెడ్డి అన్నారు. “పరిషత్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీనే చేయలేదు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించి గెలిచాం, వైసీపీ మాదిరి దాడులు, దౌర్జన్యాలతో ప్రజల్న భయబ్రాంతులకు గురిచేసి గెలవలేదు.” అని సోమిరెడ్డి ఇవాళ అమరావతిలో చెప్పుకొచ్చారు.
పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72, శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందని సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గతంలో జయలలిత కూడా స్ధానిక ఎన్నికలను బహిష్కరించారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందన్న సోమిరెడ్డి.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ పార్టీకి 25 సీట్లు కూడా రావంటూ జోస్యం చెప్పారు.
ఇలా ఉండగా, అనంతపురం జిల్లా పరిషత్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌గా మారింది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకుంది. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఆమడగూరు, ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ, బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఈ విజయంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Read also: Ambati: పోటీ చేసే దమ్ము లేకే బహిష్కరించామని చెప్పుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి ఎద్దేవా