Srisailam Dam: శ్రీశైలానికి జలకళ.. నిండుకుండల్లా తెలుగు ప్రాజెక్టులు.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు(వీడియో)

Srisailam Dam: శ్రీశైలానికి జలకళ.. నిండుకుండల్లా తెలుగు ప్రాజెక్టులు.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 19, 2021 | 10:42 PM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి జలకల సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో....

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి జలకల సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. స్పిల్‌ వే ద్వారా 1,95,881 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా మరో 58,561 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకి భారీ వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దాంతో జూరాల జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుకు లక్షా 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. దీంతో 1లక్ష 69 వేల క్యూసెక్కుల నీరు దిగువన శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతోంది. ఎగువ జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 1,25,731 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 38,799 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 884.80 అడుగులుగా ఉండగా.. ప్రాజెక్టులో 214.3637 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్న మెగాస్టార్.. అమీర్ ఖాన్..: Love Story movie Pre Release Event Live Video.

 PM Modi turns 71: మోదీకి వినూత్నంగా శుభాకాంక్షలు..! ఇలాంటి విషెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ (వీడియో)

 Miracle In Shiva Temple video: శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు.. అదే సమయంలో నాగుపాము చేసిన అద్భుతం(వీడియో)

 chasing scene Viral video: సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు.. వైరల్ గా మారిన వీడియో..