chasing scene Viral video: సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు.. వైరల్ గా మారిన వీడియో..
తమిళనాడులోని కాంచీపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కార్లను దొంగలిస్తూ అటు కార్ల యజమానులకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు పోలీసులు. తాజాగా ఆ దొంగలను పట్టుకునే సీన్....
తమిళనాడులోని కాంచీపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కార్లను దొంగలిస్తూ అటు కార్ల యజమానులకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు పోలీసులు. తాజాగా ఆ దొంగలను పట్టుకునే సీన్ సినిమా సీన్‌ను తలపించింది. ఈ ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు కూడా. అటు ఈ చేజింగ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంచీపురంలోని పలు జిల్లాల్లో కార్ల దొంగతనాలు పెరిగిపోయాయి. ఈ చోరీలకు పాల్పడుతోంది వెంకటేష్ గ్యాంగ్ అని తెలుసుకున్న పోలీసులు వాళ్లను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వెంకటేష్ గ్యాంగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగిలించబడిన కార్లకు సంబంధించిన వివరాలను అన్ని జిల్లాలకు పంపించారు పోలీస్ అధికారులు . ఇదే క్రమంలో తంజావూర్ జిల్లా పట్టుకోట్టైలో పోలీసులు చోరీకాబడ్డ కారు ఒకటి కనబడింది.
ఆ కారుని గుర్తించిన ప్రశాంత్ అనే కానిస్టేబుల్ ఆ దొంగలని పట్టుకోడానికి ప్రయత్నించాడు. పోలీసును గమనించిన దొంగలు తప్పించుకోడానికి ప్రయత్నించారు. అయితే సినిమా స్టయిల్లో పరుగెడుతూ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు కానిస్టేబుల్ ప్రశాంత్. దొంగలను పట్టుకునే క్రమంలో జరిగిన చేజింగ్ వీడియోలు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. దొంగలనుంచి కారుని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో నలుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.
మరిన్ని చదవండి ఇక్కడ : Flyover collapses Video: కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు..!ఈ వంతెన స్పెషల్ ఏంటంటే..(వీడియో)
Tamannaah Video: కొత్త కొత్త పాత్రల్లో నటిస్తే ఆ కిక్కే వేరంటున్న తమన్నా..(వీడియో).
Khel Duniya With Satya: టెన్నిస్‌స్టార్ నడాల్ అంటే మనకెందుకంత ఇష్టం..?(వీడియో)
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

