Viral Video: బాప్‌రే.. ఇది మామూలు కోతి కాదండోయ్.. ఎగిరెగిరి తంతోంది.. ఇంతకీ అతనేం చేశాడంటే..
జంతువులు చేసే పనులు కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా కోతులు చేసే పనులు ఎంత అల్లరిగా ఉంటాయో తెలిసిన విషయమే
జంతువులు చేసే పనులు కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా కోతులు చేసే పనులు ఎంత అల్లరిగా ఉంటాయో తెలిసిన విషయమే. కోతులు అంటేనే అల్లరి చేష్టలకు కేరాఫ్ అడ్రస్. కంటికి కనిపించిన వస్తువునూ కోతి అస్సలు వదిలిపెట్టదు. ముఖ్యంగా మనుషుల చేతులలో ఉన్న వస్తువులను లాక్కునేవరకు అస్సలు ఊరుకోదు. కొన్నిసార్లు కోతులు చేసే చేష్టలు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో అవి చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా ఓ కోతి చేసిన పనికి పడి పడి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి చిన్న వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కోతులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోతులు అల్లరి చేష్టల వీడియోల కొకొల్లలు. ఇందులో నవ్వులు పూయించే వీడియోలు సైతం అనేకం. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో సైతం అలాంటిదే. ఒక పార్క్లో వెళ్తున్న వ్యక్తితో కోతి గొడవకు దిగింది. అతని దగ్గరున్న బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకు అతను ప్రతిఘటించగానే.. తనను ఎగిరెగిరి తన్నుతూ నానా హంగామా సృష్టించింది. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను మీరు లుక్కేయ్యండి..
View this post on Instagram
Also Read:
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..