Andhra Pradesh: బ్యాలెట్ బాక్సులో మందుబాబు చీటీ… పెద్ద కష్టమే వచ్చిపడిందే.. ఏం రాశాడో మీరే చూడండి

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 19, 2021 | 6:50 PM

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేడు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Andhra Pradesh: బ్యాలెట్ బాక్సులో మందుబాబు చీటీ... పెద్ద కష్టమే వచ్చిపడిందే.. ఏం రాశాడో మీరే చూడండి
Slip In Ballot Box

Follow us on

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేడు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లిలో కౌంటింగ్ జరుగుతుండగా, ఓ బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు ఓ చీటీ కూడా కనిపించింది. అది చదివిన కౌంటింగ్ స్టాఫ్ షాకయ్యారు. అది ఓ మందుబాబు రాసిన చీటీగా గుర్తించారు. రకరకాల మద్యం బ్రాండ్లతో విసిగిపోయామని అందులో రాసుకొచ్చారు. నల్లచెరువు వైన్ షాపులో మంచి బ్రాండ్లు పెట్టాలని, కూలింగ్ ఉన్న బీర్లు అందుబాటులో ఉంచాలని ఆ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. ఇట్లు… నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడు అని లేఖలో పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన ఓటుతో పాటు ఈ చీటిని కూడా బ్యాలెట్ బ్యాక్సులో వేసి ఉంటాడని భావిస్తున్నారు.

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి కావచ్చింది. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో కౌంటింగ్ ముగిసింది. ఓవరాల్‌గా ప్రాదేశిక ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆ పార్టీకి 98 శాతం ఫలితాలు వచ్చాయి. ఫ్యాన్‌ గాలికి చంద్రబాబు అడ్డాలో సైతం టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. క్లీన్‌ స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది వైసీపీ. నాలుగు మండలాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది అధికార పార్టీ. మొత్తం 66 ఎంపీటీసీ సీట్లు నియోజకవర్గంలో ఉంటే 63 వైసీపీకే వచ్చాయి. 3 మాత్రమే టీడీపీకి వచ్చాయి. నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. మరోవైపు ఈ నెల 24న ఎంపీపీల ఎన్నిక, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. అందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది ఎస్.ఈ.సీ. గెలిచినఎంపీటీసీలంతా MPPలను ఎన్నుకుంటారు. జడ్పీటీసీలు ZPచైర్మన్లను ఎన్నుకుంటారు.

Also Read: ఆమెకు19, తాతకు 61.. వెరైటీ ప్రేమ కథ.. పెళ్లి చేసుకొని అందరికి షాక్‌ ఇచ్చారు..

చంద్రబాబు కంచుకోటకు బీటలు.. టీడీపీ అధినేత రాజకీయ భవితవ్యంపై నీలినీడలు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu