AP MPTC ZPTC Elections Result: చంద్రబాబు కంచుకోటకు బీటలు.. టీడీపీ అధినేత రాజకీయ భవితవ్యంపై నీలినీడలు!
Nara Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టారా? కుప్పం నియోజకవర్గంలో..
AP MPTC ZPTC Elections Result: కుప్పం నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారా? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చరిష్మా తగ్గిపోయిందా? ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను గమనిస్తే ఇదే నిజమనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభ.. నేటి ఎన్నికల ఫలితాలతో దాదాపుగా తగ్గిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇవాళ వెల్లడైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు జెడ్పీటీసీల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు ఘోర ఓటమి చవిచూశారు. గుడిపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం జడ్పీటీసీల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాంతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.
ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ఇలాకా అయిన కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు గానూ వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. అన్ని చోట్లా వైసీపీ గెలుపొందింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా వైసీపీనే గెలిచింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 17 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ గెలుపొందింది.
చంద్రబాబు స్వగ్రామంలో టీడీపీ ఘోర ఓటమి.. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది. వైసీపీ అభ్యర్థి రాజయ్య వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయంపాలైంది. నాలుగు మండలాల్లోని 89 పంచాయతీల్లో 75 చోట్ల వైసీపీ, 14 చోట్ల టీడీపీ గెలుపొందాయి. మొత్తం కుప్పం నియోజకవర్గంలో 85 శాతానికి పైగా పంచాయతీల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి దత్తత తీసుకున్న కృష్ణాజిల్లా నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని సైతం వైసీపీ గెలుపొందింది.
Also read:
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..