AP MPTC ZPTC Elections Result: ప్రకాశం జిల్లాలో విజేతను నిర్ణయించిన టాస్.. ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారంటే..
AP MPTC ZPTC Elections Result: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు మెజార్టీ స్థానాల్లో..
AP MPTC ZPTC Elections Result: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు మెజార్టీ స్థానాల్లో వైసీపీ గెలుపొందగా.. కొన్ని చోట్ల మాత్రం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీలతో అభ్యర్థులు గెలుపొందగా.. ఆయాచోట్ల రీకౌంటింగ్ చేపట్టాలంటూ పట్టుబడుతున్నారు అభ్యర్థులు. ఇదిలాఉంటే.. ప్రకాశం జిల్లా యుద్దనపూడి మండలం అనంతవరం ఎంపీటీసీ కౌంటింగ్ విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమాన ఓట్లు లభించాయి. దాంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి అభ్యర్థి గెలుపును నిర్ణయించారు. ఈ టాస్‌లో వైసీపీ అభ్యర్థి గెలవడంతో.. వారినే ఎంపీటీసీగా ప్రకటించారు ఎన్నికల అధికారులు.
అనంతవరం ఎంపీటీసీ స్థానంలో మొత్తం 2,144 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ అభ్యర్థికి 1,039, టీడీపీ అభ్యర్థికి 1,039 ఓట్లు సమానంగా వచ్చాయి. దాంతో రిటర్నింగ్ అధికారులు టాస్ ధ్వారా అభ్యర్థి గెలుపును నిర్ణయించాలని భావించారు. ఇదే విషయాన్ని ఇరు పార్టీల అభ్యర్థులకు తెలుపగా.. వారు సైతం అంగీకరించారు. దాంతో అధికారులు టాస్ వేశారు. ఈ టాస్‌లో వైసీపీ అభ్యర్థి దొడ్డా ఇందిరా దేవి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి విజయం సాధించడంతో.. ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా.. ప్రకాశం జిల్లాలో మొత్తం 784 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 348 ఏకగ్రీవం అయ్యాయి. 367 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించిన స్థానాల్లో 200 స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకోగా.. ప్రతిపక్ష టీడీపీ పార్టీ 12 స్థానాలను గెలుచుకుంది. సీపీఎం ఒక చోట గెలవగా.. ఇండిపెండెంట్లు 8 చోట్ల గెలిచారు. మరికొన్ని స్థానాల ఫలితాల వెలువడాల్సి ఉంది.
Also read:
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..