ఆమెకు19, తాతకు 61.. వెరైటీ ప్రేమ కథ.. పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు..
Girl Love With Old Man:19 ఏళ్ల అమ్మాయి తన కంటే 42 సంవత్సరాలు పెద్దయిన వ్యక్తిని వివాహం చేసుకొని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. అమెరికాలోని
Girl Love With Old Man:19 ఏళ్ల అమ్మాయి తన కంటే 42 సంవత్సరాలు పెద్దయిన వ్యక్తిని వివాహం చేసుకొని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ సంఘటన జరిగింది. వివాహం తర్వాత అమ్మాయి తన ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆ వృద్ధ వ్యక్తిని పోలీసులకు పట్టించారు.19 ఏళ్ల ఆడ్రీ చెయాన్-స్మైలీ మూన్ 61 ఏళ్ల కెవిన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మొదటగా డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆడ్రీ, కెవిన్ భార్యాభర్తలు అయినప్పటికీ వారిజంట తాత మనవరాల మాదిరిగా ఉంది.
ఆడ్రీ ఒక సైనిక పోలీసు అధికారి. జనవరి 2020లో ఆమె ఒక డేటింగ్ వెబ్‌సైట్‌లో కెవిన్‌ను కలిసింది. అతడు తనను బాగా ఆకర్షించాడని ఆడ్రీ చెప్పింది. కెవిన్ మిలటరీ పోలీసులో పనిచేసి రిటైర్మెంట్ అయ్యాడు. కెవిన్ తన కంటే 42 సంవత్సరాలు పెద్దవాడని ఆడ్రీకి ముందే తెలుసు. అయినా కానీ ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. కొన్ని నెలల్లోనే ఇద్దరూ ఐలవ్ యూ చెప్పుకున్నారు. తర్వాత వారి సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆడ్రీ వయసు తన ప్రేమకు అడ్డుకాదని కెవిన్ చెబుతున్నాడు.
అయితే కెవిన్‌కి అప్పటికే వివాహం అయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కెవిన్ పెద్ద కుమారుడు ఆడ్రీ కంటే పెద్దవాడు. అదే సమయంలో ఆడ్రీ తల్లిదండ్రులు కూడా కెవిన్ కంటే చిన్నవారు. తల్లికి 38 సంవత్సరాలు, తండ్రికి 43 సంవత్సరాలు ఉంటాయి. తన కూతురి సంబంధాన్ని అంగీకరించడానికి వారికి చాలా సమయం పట్టింది. అయితే తమ బంధానికి కెవిన్ పిల్లలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆడ్రీ తెలిపింది. తమ జంటను చూసి వారు మురిసిపోతున్నారని వివరించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..