Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP MPTC ZPTC Results: పరిషత్ పోరులో పవర్ వైఎస్సార్‌సీపీకే.. ప్రజా తీర్పు ఏకపక్షం.. జగన్ సర్కార్‌కు ప్రజల బ్రహ్మరథం

ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం. ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయింది. ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

AP MPTC ZPTC Results: పరిషత్ పోరులో పవర్ వైఎస్సార్‌సీపీకే.. ప్రజా తీర్పు ఏకపక్షం.. జగన్ సర్కార్‌కు ప్రజల బ్రహ్మరథం
Election Counting
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 19, 2021 | 10:12 PM

AP MPTC ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం. ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయింది. ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 3 జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఫ్యాన్‌ స్పీడ్‌కు ఎదురే లేకుండా పోయింది. మొత్తం అన్ని ZPTC స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి…

చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ పూర్తయింది. జిల్లాలో మొత్తం 65 ZPTC స్థానాలున్నాయి. ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో 63 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 63 స్థానాల్లోనూ వైసీపే గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక MPTCల్లోనూ ఇదే ప్రభంజనం. జిల్లాల్లో 95 శాతానికిపైగా సీట్లను గెల్చుకుంది. మొత్తం 886 స్థానాలు ఉంటే 848 చోట్ల వైసీపీ విజయదుందుభి మోగించింది.. టీటీడీ కేవలం 33 సీట్లకే పరిమతమైంది. సీపీఐ ఒకచోట, ఇండిపెండెంట్లు 19 చోట్ల విజయం సాధించారు…

నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 ZPTCలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక కర్నూలు జిల్లాలోని 52 ZPTCల్లోనూ విజయదుందుభి మోగించింది. MPTC స్థానాల్లోనూ ఫ్యాన్ గాలే వీచింది. నెల్లూరులో మొత్తం 554 ఎంపీటీసీ సీట్లు ఉండగా… 500 స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. జిల్లాలో టీడీపీ కేవలం 31 స్థానాల్లోనే గెలిచింది.. బీజేపీ 2, జనసేన ఒక చోట గెలుపొందింది. సీపీఎం 3 స్థానాల్లో ఖాతా తెరవగా మరో 13 చోట్ల ఇతరులు విజయం సాధించారు…

విశాఖలోనూ ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఇక్కడ 37 ZPTCలకు ఎలక్షన్లు జరిగితే.. 34 చోట్ల వైసీపీ విజయం సాధించింది. టీడీపీ, సీపీఏం చెరో చోట గెలుపొందాయి. MPTC సీట్లలోనూ ఇదే జోష్‌ను కొనసాగించింది అధికారపార్టీ. ఫ్యాన్‌ స్పీడ్‌ను విపక్షాలు తట్టుకోలేక పోయాయి… 486 చోట్ల వైసీపీ గెలుపొందగా… టీడీపీ కేవలం 118 సీట్లకే పరిమితమైంది..ఇక మిగతా పార్టీలు సింగిల్‌ డిజిట్‌ను దాటలేకపోయాయి..

ఇక కర్నూలు జిల్లాలో మొత్తం 807 MPTCలు ఉన్నాయి. ఇందులో 672 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ 105, బీజేపీ ఐదు చోట్ల విజయం సాధించాయి. సీపీఐ 3 చోట్ల గెలిస్తే…మరో 10 చోట్ల ఇతరులు గెలుపొందారు… ప్రకాశంలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో వైసీపీ.. మరోసారి తనకు తిరుగులేదనిపించుకుంది. మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 46 స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. విజయనగరం జిల్లాలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. జిల్లాలో మొత్తం ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కోనసీమలోనూ వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాలన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంటోంది. Read Also… 

AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని అధిక్యత.. 13 జిల్లా పరిషత్‌ల్లో 11 జెడ్పీలు కైవసం